టీఎస్ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.107 కోట్లు

Mango News, Sankranti Festival Season, TSRTC, TSRTC Earned Over Rs.107 Crore Revenue, TSRTC Earned Over Rs.107 Crore Revenue During Sankranti Festival Season, TSRTC earns record revenue, TSRTC earns record revenue from special buses, TSRTC News, TSRTC Revenue During Sankranti, TSRTC Revenue During Sankranti Festival, TSRTC Revenue During Sankranti Festival Season, TSRTC sees highest single-day earnings, TSRTC Updates

సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సులు నడిపిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సీజన్ లో మొత్తం రూ.107 కోట్లు ఆదాయం సమకూరినట్టు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన ప్రయాణికులకు ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ప్రజల సౌకర్యార్థమై షెడ్యూల్ బస్సులతోపాటు 4 వేల బస్సులను టీఎస్ఆర్టీసీ అదనంగా నడిపించిందని, దాదాపుగా 55 లక్షల మంది ప్రయాణీకులను ఎలాంటి అధనపు ఛార్జీలు లేకుండా ప్రజా సేవయే లక్ష్యంగా వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడం జరిగిందని ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.

జనవరి 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు టీఎస్ఆర్టీసీకి మొత్తం రూ.107.31 కోట్లు ఆదాయం సమకూరింది. ఇందులో అత్యధికంగా జనవరి 17న రూ.12.21 కోట్ల ఆదాయం రాగా, ఆతర్వాత జనవరి 7న రూ.12.04 కోట్లు, జనవరి 8న రూ.11.89 కోట్లు, జనవరి 10న రూ.11.04 కోట్లు ఆదాయం వచ్చింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 1 =