దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఓవైపు హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, మార్చి 1, సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కూడా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మార్చి 3, బుధవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య కోటి 56 లక్షలు (1,56,20,749) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
దేశంలో మార్చి 3 వరకు జరిగిన కరోనా వ్యాక్సినేషన్ వివరాలు(7 AM వరకు – 1,56,20,749):
- హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 67,42,187
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 27,13,144
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 55,70,230
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 834
- 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు) : 5,22,458
- కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (మొదటి డోసు): 71,896
- మొత్తం లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 1,56,20,749
దేశంలో మార్చి 2న జరిగిన కరోనా వ్యాక్సినేషన్ వివరాలు (7,68,730):
- హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 37656
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 115395
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 227762
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 834
- 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు) : 339466
- కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (మొదటి డోసు): 47617
- మార్చి 2 న లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 7,68,730
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ