దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 57.88 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత

COVID-19 Vaccination Update: Centre Provides More than 57.88 Crore Vaccine Doses to States, , Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, India Covid Vaccination, Mango News, Vaccine Distribution

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు, వినియోగం వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత కేటగిరీ సహా అన్ని విధానాల ద్వారా ఇప్పటికి మొత్తం 57.88 కోట్లకుపైగా (57,88,90,150) కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు.

ఇందులో వ్యాక్సిన్ వృధాతో కలిపి ఆగస్టు 18, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 55,11,64,635 డోసులను వినియోగించినట్టు ప్రకటించారు. ఇక అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 94 లక్షలకుపైగా (94,03,637) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే మరో 18 లక్షలకుపైగా (18,62,530) వ్యాక్సిన్ డోసులు పైప్ లైన్ లో ఉన్నాయని, త్వరలోనే రాష్ట్రాలుకు చేరుతాయని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 6 =