వైద్యరంగంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించిన కమిటీ

American Scientists David Julius And Ardem Patapoutian Win, Ardem Patapoutian win 2021 Nobel Prize, David Julius, Mango News, nobel prize, Nobel Prize 2021, Nobel Prize 2021 In Medicine, Nobel Prize 2021 In Medicine Announced, Nobel Prize in Medicine, Nobel Prize in medicine awarded to American scientists, Nobel Prize in Medicine Awarded to David Julius and Ardem, Nobel Prize Medicine US scientists, US duo Julius and Patapoutian win 2021 Nobel Prize

వైద్యశాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు గాను ఈ ఏడాది ఇద్దరు పరిశోధకులకు నోబెల్‌ బహుమతి లభించింది. అమెరికాకు చెందిన డేవిడ్‌ జూలియస్‌, అర్డెమ్‌ పటాపౌటియన్‌ లు నోబెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉష్ణోగ్రత మరియు స్పర్శ కోసం గ్రాహకాల ఆవిష్కరణలకై జరిపిన పరిశోధనలకు గానూ వారిని నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లుగా కమిటీ ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను ఈ ఇద్దరికీ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు పేరొన్నారు.

1901 నుంచీ నోబెల్‌ను వైద్యశాస్త్రంలో సేవలందిస్తున్నవారికి ప్రదానం చేస్తున్నారు. పురస్కారం కింద 6 కోట్ల రూపాయలను గ్రహీతలకు సమానంగా అందజేయనున్నారు. వైద్య శాస్త్రంలో నోబెల్‌ విజేతలను అక్టోబర్ 4న ప్రకటించగా, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో పరిశోధనలు చేసిన వారికి అక్టోబర్ 5, 6వ తేదీలలో పురస్కారాలను ప్రకటించనున్నారు. డబుల్‌ హెడర్‌ సాహిత్య ప్రైజ్‌ను,శాంతి నోబెల్‌ బహుమతిని అక్టోబర్ 7, 8 తేదీలలో, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అక్టోబర్ 11న ప్రకటించనున్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీద ఇచ్చే ఈ ఘన పురస్కారాలను, ప్రతీ సంవత్సరం ఆయన వర్థంతి (డిసెంబర్‌ 10) సందర్భంగా ప్రదానం చేస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + seventeen =