టీఆర్ఎస్ లో పలువురు ప్రజాప్రతినిధులు చేరిక, కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR, KTR Comments over TPCC President, KTR Comments over TPCC President Revanth Reddy, KTR Latest News, KTR Revanth Reddy Comments, KTR Vs Revanth Reddy, Mango News, Revanth Reddy, Telangana Political News, TPCC President, TPCC President Revanth Reddy, TRS Working President KTR, TRS Working President KTR Comments over TPCC President Revanth Reddy

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో సోమవారం నాడు తెలంగాణ భవన్ లో వికారాబాద్, చండూరుకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్లు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నివర్గాల ప్రజలకు చేరుతున్నయన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలని, పేదల ముఖాల్లో చిరునవ్వులు వెలగాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయం అన్నారు. 60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని మంత్రి విమర్శించారు. మునుగోడు నియోజవర్గంలో ఇప్పటికీ ఫ్లోరోసిస్ సమస్యతో బాధపడుతున్నారని, ఎన్నో ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదా? ఆ పాపం వారిది కాదా అని? మంత్రి ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నల్గొండ జిల్లాను ఫ్లోరోసిస్ నుంచి విముక్తి కలిగించేలా మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చామని చెప్పారు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ, ప్రజలకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణకు తొలి ద్రోహి అని మంత్రి కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు పంచన చేరిన రేవంత్ రెడ్డికి, అమరుడు శ్రీకాంతాచారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. మాణిక్కమ్ ఠాకూర్ కి రూ.50 కోట్లు ఇచ్చి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కొనుక్కున్నాడని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారు. టీఆర్ఎస్ లేకపోతే, సీఎం కేసీఆర్ లేకపోతే ఈ టీపీసీసీ ఎక్కడిది? టీబీజేపీ ఎక్కడిది? వాళ్ళకి అధ్యక్ష పదవులు ఎక్కడ నుంచి వచ్చేవన్నారు. సీఎం కేసీఆర్ మీద సంస్కారం లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక బీజేపీ నాయకులు చేస్తున్న పాదయాత్రలు ప్రజల కోసం కాదు. తిన్నది అరగక చేస్తున్న అజీర్తి యాత్రలని మంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం నిత్యం ప్రశంసిస్తుంటేఎం వారికీ నిద్ర పట్టడంలేదని ఎద్దేవా చేశారు. మరోవైపు రైతుబంధు ఇచ్చిన విధంగానే దళిత బంధు పథకాన్ని కూడా రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =