ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం, నైట్ కర్ఫ్యూ విధింపు

delhi corona cases, delhi corona cases update, delhi coronavirus, delhi coronavirus cases, delhi coronavirus cases live update, Delhi Coronavirus Deaths, delhi coronavirus news, delhi coronavirus update today, Delhi Coronavirus Updates, Delhi Govt Decided to Imposed 10 pm to 5 am Night Curfew, Delhi Govt Decided to Imposed 10 pm to 5 am Night Curfew till April 30, Delhi Imposes Night Curfew, Delhi Imposes Night Curfew Till 30th, Delhi New Positive Cases, Delhi Night Curfew, Mango News

రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 6, మంగళవారం నుంచి ఏప్రిల్ 30 వరకు ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్టు ప్రకటించారు. కరోనా కేసుల్లో ఆకస్మిక పెరుగుదలతో పాటుగా అధిక పాజిటివిటీ రేటు నమోదవుతున్న దృష్ట్యా అంటే నైట్ కర్ఫ్యూ పెట్టాలని నిర్ణయించినట్టు ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నైట్ కర్ఫ్యూ సమయంలో టీకాలు వేసేవారికి, ఇతర అవసరమైన సేవల కోసం ఇ-పాస్‌లతో అనుమతిస్తామని తెలిపారు. వైద్య సిబ్బంది, జర్నలిస్టులను ఐడి కార్డులతో అనుమతిస్తామని, వైద్యం అవసరమైన వారిని, గర్భిణీ స్త్రీలకు కూడా నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఇచ్చినట్టు చెప్పారు.

మరోవైపు ఢిల్లీలో కరోనా పరిస్థితిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు ఢిల్లీలో నాలుగు కరోనా వేవ్ నడుస్తుందని, అందువలనే కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ విధించే ఆలోచన కూడా లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =