స్పైస్‌జెట్‌ కు డీజీసీఏ షాక్‌, వచ్చే 8 వారాలు 50శాతం విమానాలనే నడపాలంటూ ఆదేశాలు

DGCA Curtailed SpiceJet Flight Operations to 50 Percent for the next 8 Weeks, DGCA curtails SpiceJet flights to 50 Percent for 8 weeks, DGCA orders SpiceJet to operate only half of its flights for the next 8 Weeks, DGCA restricts SpiceJet flights to 50 Percent, DGCA ordered SpiceJet to operate not more than 50 percent of its flights for eight weeks, Directorate General of Civil Aviation, DGCA Curtailed SpiceJet Flight Operations, SpiceJet Flight Operations, India's aviation safety regulator has ordered SpiceJet to operate only half of its flights for the next eight weeks, DGCA Curtailed SpiceJet, SpiceJet News, SpiceJet Latest News, SpiceJet Latest Updates, SpiceJet Live Updates, Mango News, Mango News Telugu,

స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) షాకిచ్చింది. స్పైస్‌జెట్‌ సంస్థ తక్కువ వ్యవధిలో అనేక స్నాగ్‌లను నివేదించిన నేపథ్యంలో వచ్చే ఎనిమిది వారాల పాటు స్పైస్‌జెట్ విమాన కార్యకలాపాలను 50%కి తగ్గించినట్లుగా డీజీసీఏ ప్రకటించింది. ఈ మేరకు డీజీసీఏ బుధవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. “వివిధ స్పాట్ చెక్‌లు, తనిఖీలు మరియు స్పైస్‌జెట్ కు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ప్రత్యుత్తరం సమర్పించిన దృష్ట్యా, ఈ ఆర్డర్ జారీ చేసిన తేదీ (జూలై 27) నుండి 8 వారాల వ్యవధిలో సమ్మర్ షెడ్యూల్ 2022 కింద ఆమోదించబడి బయలుదేరే సంఖ్యలో స్పైస్‌జెట్ విమానాల యొక్క డిపార్చర్స్ సంఖ్య 50%కి పరిమితం చేయబడింది. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937లోని రూల్ 19A కింద అందించబడిన అధికారాలకు అనుగుణంగా ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నాం” అని డీజీసీఏ పేర్కొంది.

డీజీసీఏ తాజా ఆంక్షలతో వచ్చే ఎనిమిది వారాలపాటు స్పైస్‌జెట్‌ మొత్తం విమానాలల్లో 50 శాతం మాత్రమే నడపాల్సి ఉంటుంది. జూన్ 19 మరియు జూలై 5 మధ్య స్పైస్‌జెట్ విమానాలు కనీసం ఎనిమిది సాంకేతిక సమస్యలు వెలుగుచూసిన నేపథ్యంలోనే డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు డీజీసీఏ ఆంక్షలపై స్పైస్‌జెట్‌ సంస్థ స్పందిస్తూ, “మేము డీజీసీఏ ఆర్డర్‌ని అందుకుంటున్నాము మరియు రెగ్యులేటర్ ఆదేశాల ప్రకారం పని చేస్తాము. ప్రస్తుత లీన్ ట్రావెల్ సీజన్ కారణంగా, ఇతర విమానయాన సంస్థల మాదిరిగానే స్పైస్‌జెట్ కూడా తన విమాన కార్యకలాపాలను ఇప్పటికే రీషెడ్యూల్ చేసింది. కాబట్టి, మా విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. రాబోయే రోజులు మరియు వారాల్లో మా విమానాలు షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయని మేము మా ప్రయాణీకులకు మరియు ప్రయాణ భాగస్వాములకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాము. ఈ ఆర్డర్ పర్యవసానంగా విమాన రద్దు ఉండదు. స్పైస్‌జెట్ సంఘటనల ధోరణిని అదుపు చేయడానికి చర్యలు తీసుకోవడం చాలా ప్రోత్సాహకరంగా ఉందని డీజీసీఏ యొక్క పరిశీలనలో ఉందని, మేము రెగ్యులేటర్ యొక్క సన్నిహిత మార్గదర్శకత్వంలో పనిని కొనసాగిస్తాం” అని ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 10 =