ఆగస్టు 8న హైటెక్స్ లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

CM K Chandrashekhar Rao To Launch Swatantra Bharatha Vajrotsavalu on August 8 at Hitex - Committee Chairman Keshava Rao, CM KCR To Launch Swatantra Bharatha Vajrotsavalu on August 8 at Hitex - Committee Chairman Keshava Rao, Telangana CM KCR To Launch Swatantra Bharatha Vajrotsavalu on August 8 at Hitex - Committee Chairman Keshava Rao, KCR To Launch Swatantra Bharatha Vajrotsavalu on August 8 at Hitex - Committee Chairman Keshava Rao, Swatantra Bharatha Vajrotsavalu at Hitex, Swatantra Bharatha Vajrotsavalu Launch on August 8 at Hitex, Committee Chairman Keshava Rao, Hitex, Telangana Swatantra Bharatha Vajrotsavalu Swatantra Bharatha Vajrotsavalu, Swatantra Bharatha Vajrotsavalu News, Swatantra Bharatha Vajrotsavalu Latest News, Swatantra Bharatha Vajrotsavalu Latest Updates, Swatantra Bharatha Vajrotsavalu Live Updates Mango News, Mango News Telugu,

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు, సంబరాలను 15 రోజుల పాటుగా ఘనంగా నిర్వహించాలని నిర్వహించాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే “స్వతంత్ర భారత వజ్రోత్సవాలు” ప్లాన్ చేయడానికి మరియు నిర్వహించడానికి 24 మందితో కూడిన ఒక కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ రాష్ట్ర కమిటీ చైర్మన్ మరియు రాజ్యసభ ఎంపీ కె.కేశవ రావు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ బుధవారం బి.ఆర్.కె.ఆర్. భవన్ లో సమావేశం అయ్యింది. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డా.కె.వి.రమణా చారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, దేశపతి శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఆగస్టు 8న హైటెక్స్ లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ :

ఈ సందర్భంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు మరియు రాజధాని నగరంలో 15 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ప్రజలందరినీ ఈ ఉత్సవాలలో పాల్గొనేలా చేయాలని నిర్ణయించారు. తొలి రోజు వేడుకలు ఆగస్టు 8వ తేదీన హైటెక్స్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు తెలిపారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమం యొక్క ప్రతి అడుగు, ప్రతి క్షణం గుర్తుంచుకునే విధంగా ద్విసప్తాహం వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ వేడుకల ప్రాముఖ్యత గురించి పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుకు చేసుకునే విధంగా ఫిల్మ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని, ఈ ఉత్సవాలను ఆగస్టు 22 వరకు కొనసాగించి, నగరంలోని నెక్లస్ రోడ్డు వద్ద ఒక పెద్ద ర్యాలీ నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. బి.ఆర్.కె.ఆర్. భవన్ లో జరిగిన ఈ సమావేశంలో న్యూఢిల్లీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వర్చువల్ గా పాల్గొనగా, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామ కృష్ణా రావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జి.ఎ.డి పొలిటికల్ సెక్రెటరీ శేషాద్రి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =