ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు నిలిపివేస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన విధంగానే తమ దేశం తరఫున డబ్ల్యూహెచ్ఓకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని ట్రంప్ అధికారుల్ని ఆదేశించారు. ఆ సంస్థ ప్రాథమిక విధిలో విఫలమైందని, జవాబుదారీగా ఉండలేదని ట్రంప్ ఆరోపించారు. మరోవైపు కరోనా వైరస్ ముప్పుపై ప్రపంచాన్ని ముందుగా హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందన్న ఆరోపణలపై సమీక్ష నిర్వహిస్తున్నామని, ఆ సంస్థను ఆదేశించే హక్కు మాకుందని ట్రంప్ పేర్కొన్నారు.
కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో చైనా సహా ఇతర దేశాల ప్రయాణాలపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ డబ్ల్యూహెచ్ఓ తీసుకొన్న నిర్ణయం అతిపెద్ద తప్పు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా తీసుకున్న పలు నిర్ణయాల్ని డబ్ల్యూహెచ్ఓ వ్యతిరేకించిందని, అయినా ఆ సంస్థ నిర్ణయాలతో ఏకీభవించకుండా చైనా ప్రయాణాలపై ఆంక్షలు అమలు చేయడం వలనే చాలామంది ప్రాణాల్ని రక్షించామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా అనారోగ్య మహమ్మారి వ్యాప్తి చెందే సమయంలో అన్ని ప్రపంచ దేశాలు ఖచ్చితమైన సమాచారం కోసం డబ్ల్యూహెచ్ఓపై ఆధారపడతాయని, అయితే ఈసారి ఆ సంస్థ తన కనీస బాధ్యత నిర్వహణలో విఫలమైందని ట్రంప్ ఆరోపించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]