ఎన్నిక‌ల‌కు డోనాల్డ్ ట్రంప్ అన‌ర్హుడు.. కొల‌రాడో కోర్టు సంచలన తీర్పు

Donald Trump Is Ineligible For Election Colorado Courts Sensational Verdict, Donald Trump Is Ineligible For Election Colorado, Donald Trump Is Ineligible For Election, Donald Trump Is Ineligible, Trump Is Ineligible Election, Donald Trump, America, Republican Party, Washington, Latest Donald Trump Is Ineligible For Election News, Donald Trump Is Ineligible For Election News Updste, Election News USA, USA Political News, World News, Mango News, Mango News Telugu
Donald trump, America, Republican party, Washington

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వరుసగా బిగ్ షాకులు తగులుతున్నాయి. రెండోసారి వైట్‌హౌస్‌కు చేరుకోవాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న వేళ.. ఆయన్ను వరుస చిక్కులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజుల క్రితం జైలుకు కూడా వెళ్లొచ్చారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు ప్రకటించింది.

2014లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందడం కోసం ట్రంప్ కొద్దిరోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ట్రంప్‌తో పాటు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి ఎన్నికల రేసులో ఉన్నారు. ముందు నుంచి కూడా ప్రీపోల్ సర్వేల్లో డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. కానీ ట్రంప్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన్ను చిక్కులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా  రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు ప్రకటించడం సంచలనంగా మారింది.

అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి కేసు కారణంగానే కొలరాడో సుప్రీంకోర్టు ట్రంప్‌పై అనర్హత వేటు వేసింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయయ్యారు. అయితే ట్రంప్ ఓటమికి ఎన్నికల కమిషనే ప్రధాన కారణమని ఆయన మద్ధతుదారులు 2023 జనవరిలో వాషింగ్టన్‌లో నిరసన చేపట్టారు. యూఎస్ పార్లమెంట్ భవనంపై దాడి చేశారు. రణరంగం సృష్టించారు. అయితే ఈ దాడి వెనుక ట్రంప్ హస్తం ఉందని ముందు నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి.

గతంలో క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిని ట్రంప్ ప్రేరేపించినట్లు గతంలో ఓ జిల్లా కోర్టు కూడా ధ్రువీకరించింది.  ఇటు కొలరాడో సుప్రీంకోర్టు కూడా ఆ దాడి వెనుక ట్రంప్ హస్తం ఉందనడానికి తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయన త్వరలో జరగబోయే రిపబ్లిక్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ  చేయకుండా ట్రంప్‌పై అనర్హత వేటు వేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14 సవరణ సెక్షన్ 3 నిబంధన ప్రకారం ట్రంప్‌పై అనర్హత వేటు వేసినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్‌కు కొలరాడో సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. ఏది ఏమయినప్పటికీ ఎన్నికల ముందు ట్రంప్‌పై అనర్హత వేటు వేయడం అమెరికా వ్యాప్తంగా సంచలనంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 17 =