టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్

ECB Announced Joe Root Resigns as England Test Captain Amid Loss of Form, Joe Root Resigns as England Test Captain Amid Loss of Form, Joe Root Decides To Step Down As Test Captain Of England Cricket Team, Test Captain Of England Cricket Team, Joe Root quits as England captain, Ben Stokes has been installed as the odds-on favourite to become the new England Test captain after Joe Root's resignation, Joe Root's resignation, Joe Root resigns as England Test captain, Joe Root has resigned as England men's Test captain, England men's Test captain, Joe Root, ECB Announced Joe Root Loss of Form, Root has resigned the England men's Test captain, England Cricket Team, England Test Captain News, England Test Captain Latest News, England Test Captain Latest Updates, Mango News, Mango News Telugu,

ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈమేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారిక ప్రకటన చేసింది. గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 1-0 తేడాతో ఓటమి, 4-0తో యాషెస్ ఓటమి నేపథ్యంలో రూట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. జో రూట్ స్థానంలో ఇంగ్లాండ్ అల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను నియమించనున్నారు. చాలా కాలం పాటు రూట్‌కి వైస్ కెప్టెన్‌గా ఉన్నందున, స్టోక్స్ ఎంపికపై బోర్డు సానుకూల దృక్పథంతో ఉంది. అయితే స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ మరియు స్క్వాడ్ ప్లేయర్ సామ్ బిల్లింగ్స్ కూడా కెప్టెన్సీ స్థానానికి పోటీ పడుతున్నారు. కాగా రూట్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ తన చివరి 17 మ్యాచ్ లలో కేవలం ఒకే ఒక టెస్ట్ మ్యాచ్‌ను మాత్రమే గెలుచుకుంది. ఇంగ్లండ్‌లో అత్యధిక టెస్ట్ రన్ స్కోరర్ అయిన రూట్ కెప్టెన్ గా ఈ మధ్య కాలంలో ప్రతిభ చూపించలేకపోయాడు.

ఇండియాతో మ్యాచ్ అంటే రూట్ చెలరేగి ఆడతాడు. సాధారణంగా ఇంగ్లాండ్ టీమ్ లోని మిగిలిన బ్యాటర్స్ అంతా స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో తడబాటు పడతారు. కానీ, రూట్ మాత్రం అలవోకగా స్పిన్ ఆడగలడు. సుదీర్ఘంగా క్రీజులో నిలిచి భారీ స్కోర్లు సాధించగలగటం రూట్ ప్రత్యేకత.  బ్యాట్‌తో చాలా కాలం పాటు అద్భుతమైన వ్యక్తిగత ఫామ్‌లో ఉన్నప్పటికీ, ఐదు వరుస సిరీస్ పరాజయాల తర్వాత రూట్ కెప్టెన్‌గా నిలదొక్కుకోలేకపోయాడు. రూట్ ఇంగ్లండ్ తరపున పురుషుల కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు మరియు విజయాలు సాధించిన రికార్డును కలిగి ఉన్నాడు. వెటరన్ కెప్టెన్స్ మైఖేల్ వాన్, ఆండ్రూ స్ట్రాస్ మరియు అలెస్టర్ కుక్ వంటి వారి కంటే అధికంగా 27 టెస్టు విజయాలతో నెం. 1 కెప్టెన్‌గా నిలిచాడు. ఇది నేను తీసుకున్న అత్యంత సాహసోపేత నిర్ణయం అని రూట్ కెప్టెన్సీని వదులుకోవడంపై స్పందించాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 1 =