ప్రపంచ కుబేరుడు, నూతన ట్విట్టర్ అధిపతి ఎలోన్ మస్క్ శుక్రవారం సాయంత్రం ట్విట్టర్లో ఒక ఆసక్తికర పోల్‌ను నిర్వహించారు. ట్విట్టర్ అకౌంట్ నుండి నిషేధించబడిన మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సోషల్ మీడియా సైట్‌కి తిరిగి చేర్చాలా వద్దా అనే దానిపై ఓటు వేయమని వినియోగదారులను కోరారు. దీనికోసం ఎలోన్ మస్క్ ఒకరోజు సమయం ఇవ్వగా.. మొదటి రెండు గంటల్లోనే పోల్‌లో 2 మిలియన్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇందులో దాదాపు 60% మంది ‘అవును’ అని ఓటు వేశారు. కాగా ట్రంప్ హింసను ప్రేరేపించే విధంగా పోస్టులు పెడుతున్నట్లు ఆరోపణలు వచ్చిన కారణంగా 2021లో అప్పటి యాజమాన్యం ట్విట్టర్ నుండి ఆయనను శాశ్వతంగా నిషేధించారు.
Reinstate former President Trump
— Elon Musk (@elonmusk) November 19, 2022
ఇక డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుడిగా మస్క్ కు గుర్తింపు ఉంది. ఎప్పుడైతే ఆయన ట్విట్టర్‌ను దక్కించుకున్నారో అప్పటినుంచే దీనిపై అందరిలో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ డొనాల్డ్ ట్రంప్‌ను తిరిగి ట్విట్టర్లోకి తీసుకురావడానికి మస్క్ ప్రయత్నిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిలో భాగంగానే ఈ ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని ట్విట్టర్ కార్యాలయాలు మూసివేయబడిన విషయం తెలిసిందే. ఎక్కువ గంటలు పనిచేయాల్సిందిగా మస్క్ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేసిన క్రమంలో వేలాదిగా ఉద్యోగులు రాజీనామా బాట పట్టడంతో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న మళ్ళీ కార్యాలయాలు తిరిగి తెరువబడుతాయని ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE