ఫిఫా ప్రపంచ కప్ 2022: సెమీఫైనల్స్‌లో మొరాకోపై ఫ్రాన్స్ ఘనవిజయం, ఫైనల్‌లో అర్జెంటీనాతో ఢీ

FIFA World Cup 2022 France Beats Morocco 2-0 in 2nd Semi-Finals Ready To Fight with Argentina in Final Match,FIFA World Cup, Argentina win over Croatia,FIFA semis final,star player Messi shines,FIFA World Cup-2022,FIFA World Cup Argentina,FIFA World Cup Croatia,FIFA World Cup Semifinals,Mango News,Mango News Telugu,World Cup 2022 Knockout Stage,FIFA World Cup Schedule,FIFA Knockout Bracket,FIFA World Cup,FIFA World Cup Schedule 2022,FIFA World Cup 2022 Schedule,2022 FIFA World Cup Qatar,2022 FIFA World Cup Knockout Stage,FIFA World Cup Qatar 2022,FIFA World Cup 2022 Schedule

ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫైనల్‌లో తలపడే జట్లు ఏవో తేలిపోయింది. ఇప్పటికే అర్జెంటీనా తొలి సెమీఫైనల్స్‌లో క్రొయేషియాపై గ్రాండ్ విక్టరీతో ఫైనల్‌ చేరగా, తాజాగా ఫ్రాన్స్ కూడా ఫైనల్‌లో అడుగు పెట్టింది. ఈ క్రమంలో బుధవారం అర్ధ‌రాత్రి జ‌రిగిన రెండవ సెమీఫైన‌ల్స్‌లో మొరాకోపై 2-0 తేడాతో విజ‌యాన్ని సాధించింది. తద్వారా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో వ‌రుస‌గా రెండోసారి ఫైన‌ల్ చేరుకొని ఫ్రాన్స్ చ‌రిత్ర‌ను సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఫ్రాన్స్ దూకుడుకు మొరాకో తలవంచింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే ఫ్రాన్స్ ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మ్యాచ్ మద్దలైన కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే తొలి గోల్ చేసింది.

మిడ్ ఫీల్డర్స్ గ్రీజ్‌మ‌న్‌, ఎంబాపే ఇచ్చిన పాస్‌ను హెర్నాండేజ్ గోల్‌ కొట్టి ఫ్రాన్స్ కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేశాయి. ఇక సెకండాఫ్ ప్రారంభమయ్యాక డెంబ‌లే స్థానంలో 78వ నిమిషంలో స‌బ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి అడుగుపెట్టిన ఫ్రాన్స్ స్ట్రైక‌ర్ కోలో మువాని సూపర్ కిక్ తో గోల్ చేసి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఇక చివరి వరకు మొరాకో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. దీంతో 2018 వ‌ర‌ల్డ్ క‌ప్‌ విజేత‌గా నిలిచిన ఫ్రాన్స్, వ‌రుస‌గా రెండోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక ఆదివారం జరుగనున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో దిగ్గజ జట్టు అర్జెంటీనాతో తలపడి అదృష్టం పరీక్షించుకోనుంది. అయితే దీనికి ముందు మూడో స్థానం కోసం క్రొయేషియా-మొరాకో మధ్య శనివారం కీలక పోరు జరుగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 8 =