ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్‌లపై దాడుల వెనుక చైనీస్ హ్యాకర్ల హస్తం, కీలక డేటా తస్కరణ

Aiims Delhi Servers Attacked By Chinese Hackers Data Retrieved From Five Servers Successfully,Chinese Hackers Behind Delhi Aiims Servers,Delhi Aiims Servers,Hackers Theft Delhi Aiims Vital Data,Mango News,Mango News Telugu,Aiims Delhi,Aiims Delhi Servers Attacked,Aiims Servers Attacked By Chinese Hackers,Aiims Data Retrieved From Servers,Aiims News And Live Updates,Delhi Aiims,Aiims Delhi News And Updates

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కంప్యూటర్ సిస్టమ్‌పై దాడి వెనుక సంచలన విషయం వెలుగు చూసింది. ఈ ఘటన వెనుక చైనాకు చెందిన హ్యాకర్ల హస్తం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సర్వర్ దాడి చైనీయులచే జరిగిందని దర్యాప్తులో తేలిందని, హాస్పిటల్‌లోని లక్షల మంది రోగుల వివరాలు ఇప్పుడు తిరిగి పొందబడ్డాయని ఒక ఉన్నత స్థాయి అధికారి వెల్లడించారు. కాగా ఎయిమ్స్ లోని మొత్తం 100 సర్వర్‌లలో.. 40 భౌతిక మరియు 60 వర్చువల్ సర్వర్‌లు ఉన్నాయని, వీటిలో 5 సర్వర్లు హ్యాకర్లచే దాడికి గురైనట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఐదు సర్వర్‌లలోని డేటా విజయవంతంగా తిరిగి పొందబడిందని ఆ అధికారి తెలియజేశారు.

నవంబర్ 23న దీనిని గుర్తించిన యాజమాన్యం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్ సైబర్ టెర్రరిజం కేసును నమోదు చేసింది. ఇక ఎయిమ్స్‌లో దాదాపు 38 లక్షల మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీరందరి ఆరోగ్యానికి సంబంధించిన డేటా హ్యాకర్ల చేతికి చిక్కడంతో ఐటీ అత్యవసర బృందాలతో పాటు అగ్రశ్రేణి ఇంటెలిజెన్స్ మరియు యాంటీ టెర్రర్ ఏజెన్సీలు దృష్టి సారించాయి. ఈ సందర్భంగా హ్యాకర్లు 200 కోట్ల రూపాయల క్రిప్టోకరెన్సీని డిమాండ్ చేసినట్లుగా కూడా వార్తలొచ్చాయి. అయితే పోలీసులు ఈ వార్తలను ఖండించారు. ప్రస్తుతం అన్ని సర్వర్లకు మరియు కంప్యూటర్లలో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాలేషన్‌ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 6 =