ఫిఫా ప్రపంచ కప్ 2022: నేడు క్రొయేషియా-మొరాకో మధ్య కీలక మ్యాచ్, మూడో స్థానం కోసం పోటీ

FIFA World Cup Fight Between Croatia and Morocco For Third Place Today Night,FIFA World Cup,World Cup Croatia and Morocco,FIFA semis final,star player Messi shines,FIFA World Cup-2022,FIFA World Cup Argentina,FIFA World Cup Croatia,FIFA World Cup Semifinals,Mango News,Mango News Telugu,World Cup 2022 Knockout Stage,FIFA World Cup Schedule,FIFA Knockout Bracket,FIFA World Cup,FIFA World Cup Schedule 2022,FIFA World Cup 2022 Schedule,2022 FIFA World Cup Qatar,2022 FIFA World Cup Knockout Stage,FIFA World Cup Qatar 2022,FIFA World Cup 2022 Schedule

ఆదివారం జరగనున్న ఫిఫా ఫైనల్స్‌కు ముందు మూడో ప్లేస్ ప్లే-ఆఫ్ కోసం శనివారం క్రొయేషియా మరియు మొరాకో మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా క్రొయేషియాపై 3-0తో ఘనవిజయం సాధించి ముందుగా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోగా, అనంతరం రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో మొరాకోపై ఫ్రాన్స్ 2-0తో ఓడించి ఫైనల్ చేరింది. ఈ నేపథ్యంలో మూడవ స్థానం కోసం రెండు జట్లు ఈ రోజు రాత్రి ప్లే-ఆఫ్ కోసం తలపడనున్నాయి. ఇక యాదృచ్ఛికంగా, మొరాకో మరియు క్రొయేషియా రెండూ గ్రూప్ ఎఫ్‌లో ఉన్నాయి. గ్రూప్ 16 స్థాయిలో పాయింట్ల పట్టికలో మొరాకో రెండవ స్థానంలో మరియు క్రొయేషియా మొదటి స్థానంలో నిలిచాయి. క్రొయేషియా ప్రపంచ కప్ ను విజయంతో ముగించాలని పట్టుదలగా ఉంది. అలాగే మొరాకో గెలిస్తే టోర్నమెంట్ చరిత్రలో మూడవ స్థానంలో నిలిచిన మొదటి ఆఫ్రికన్ దేశంగా చరిత్ర సృష్టిస్తుంది.

కాగా మొరాకో ఇప్పుడు ప్రపంచంలో 22వ స్థానంలో ఉండగా, క్రొయేషియా 12వ స్థానంలో ఉంది. అయితే ఈ మెగా టోర్నమెంట్‌లో స్పెయిన్ మరియు బెల్జియం వంటి మేటి జట్లను మొరాకో ఓడించినందున, గెలవాలంటే క్రొయేషియా చెమటోడాల్సి ఉంటుంది. ఇక క్రొయేషియా తరపున గత ప్రపంచ కప్ ఆడిన ప్రముఖ ఆటగాళ్లు లూకా మోడ్రిక్ మరియు ఇవాన్ పెరిసిక్ కీలకం కానున్నారు. అలాగే మొరాకో జట్టులో అచ్రాఫ్ హకీమి, హకీమ్ జియెచ్ మరియు యూసఫ్ ఎన్-నెసిరి సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మూడో స్థానంలో నిలిచేదెవరో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో డిసెంబర్ 17న రాత్రి 8:30 గంటలకు మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇండియాలో స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ 18 హెచ్‌డీ మరియు డీడీ స్పోర్ట్స్ ఛానెల్‌లలో ప్రసారం కానుంది. మరోవైపు రేపు రాత్రికి అర్జెంటీనా-ఫ్రాన్స్ మధ్య తుది సమరం జరుగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =