ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కన్నుమూత

Former Australia Cricketer Legendary Spinner Shane Warne Passes away at 52, Former Australia Cricketer Legendary Spinner Shane Warne Passes away, Former Australia Cricketer Legendary Spinner Shane Warne Passed away at 52, Australia Cricketer Legendary Spinner Shane Warne Passed away at 52, Former Australia Cricketer, Legendary Spinner Shane Warne Passes away at 52, Australia Cricketer, Legendary Spinner Shane Warne, Legendary Spinner, Shane Warne, Shane Warne Passes away at 52, Cricketer, Cricket, Cricket Latest News, Cricket Latest Updates, Mango News, Mango News Telugu,

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ (52) కన్నుమూశారు. థాయిలాండ్ లో ఉన్న ఆయనకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. “షేన్ వార్న్ తన విల్లాలో స్పందించని స్థితిలో పడి ఉన్నారు. సిబ్బంది వార్న్ ను ఆసుపత్రికి తరలించగా, వైద్య సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయనలో స్పందన లేదు. షేన్ వార్న్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు” అని వార్నర్ మేనేజ్‌మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది.

షేన్ వార్న్ 15 సంవత్సరాల తన అంతర్జాతీయ కెరీర్ లో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. షేన్ వార్న్ మొత్తం 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశారు. ఇక టెస్టుల్లో 37సార్లు 5 వికెట్లు, 10 సార్లు 10 వికెట్లు పడగొట్టి అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. ఆస్ట్రేలియా తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలవడమే కాకుండా, క్రికెట్ చరిత్రలో ముత్తయ్య మురళీధరన్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన రెండవ ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. షేన్ వార్న్ ఆకస్మిక మృతి పట్ల పలువురు క్రికెటర్లు, సెలెబ్రిటీలు, క్రీడాభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 13 =