డిజిటల్ సభ్యత్వాలలో టీ-కాంగ్రెస్ దేశంలోనే నెంబర్‌వన్‌ – టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి

TPCC Chief Revanth Reddy Says T-Congress is Number One in Digital Memberships of The Country, Revanth Reddy Says T-Congress is Number One in Digital Memberships of The Country, TPCC Chief Revanth Reddy, T-Congress is Number One in Digital Memberships of The Country, T-Congress, Number One in Digital Memberships of The Country, digital membership, TPCC Chief, TPCC, TPCC President Revanth Reddy, Telangana Pradesh Congress Committee, Telangana Pradesh Congress Committee President Revanth Reddy, Telangana Congress, Telangana PCC, Mango News, Mango News Telugu,

డిజిటల్ సభ్యత్వాలలో టీ-కాంగ్రెస్ దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి తెలిపారు. దీనిపై ఈరోజు (శుక్రవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటోందని అన్నారు. దీనికి నిదర్శనమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేయటం అని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నవారికి రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఇన్సూరెన్స్ పర్యవేక్షణ కోసం పార్టీలో త్వరలోనే కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

సీఎం కేసీఆర్ రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవటానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారని రేవంత్‌ రెడ్డి అన్నారు. అందుకే వ్యూహకర్తల సాయం తీసుకుంటున్నారని ఆయన  అన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి వ్యూహకర్తలు అవసరం లేదని.. పార్టీకి కార్యకర్తలే ప్రధాన బలం అని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తప్పకుండ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, కేంద్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రేవంత్‌ రెడ్డి అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + nineteen =