మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ దంపతులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Coronavirus, COVID-19, Deve Gowda Test Positive for Covid-19, Deve Gowda tests positive for Covid-19, Former PM H D Devegowda and his wife test positive, Former PM HD Deve Gowda, Former Prime Minister HD Deve Gowda, Former Prime Minister HD Deve Gowda Test Positive, Former Prime Minister HD Deve Gowda Test Positive for Covid-19, HD Deve Gowda, Mango News

మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యూలర్) జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నాకు, నా భార్య చెన్నమ్మకు కరోనా పాజిటివ్ గా తేలింది. మేము ప్రస్తుతం ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నాము. గత కొన్ని రోజులుగా మాతో సంప్రదించిన వారందరూ కరోనా పరీక్ష పరీక్షించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరుతున్నాను” అని హెచ్‌డీ దేవెగౌడ ట్వీట్ చేశారు. మరోవైపు హెచ్‌డీ దేవెగౌడతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. వారి ఆరోగ్యం గురించి ఆరా తీసి, కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =