నేడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన బీసీసీఐ, కోహ్లీ, సెహ్వాగ్, రైనా!

Former Team India Captain MS Dhoni Celebrates 41st Birthday Today Sehwag Raina and Others Extends Wishes, Sehwag Wishes Former Team India Captain MS Dhoni Oh His 41st Birthday, Raina Wishes Former Team India Captain MS Dhoni Oh His 41st Birthday, Former Team India Captain MS Dhoni Celebrates 41st Birthday Today Others Extends Wishes, Former Team India Captain MS Dhoni Celebrates 41st Birthday Today, Team India Captain MS Dhoni Celebrates 41st Birthday Today, EX-Team India Captain MS Dhoni Celebrates 41st Birthday Today, Captain MS Dhoni Celebrates 41st Birthday Today, MS Dhoni Celebrates 41st Birthday Today, Former Team India Captain MS Dhoni, EX-Team India Captain MS Dhoni, Captain MS Dhoni, MS Dhoni, Captain MS Dhoni Birthday Celebrations News, Captain MS Dhoni Birthday Celebrations Latest News, Captain MS Dhoni Birthday Celebrations Latest Updates, Captain MS Dhoni Birthday Celebrations Live Updates, Mango News, Mango News Telugu,

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేడు 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్ కు ధోనీ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ అతనికి శుభాకాంక్షలు తెలిపింది బీసీసీఐ. అలాగే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ఆటగాళ్లు సెహ్వాగ్, రైనా సహా మరి కొందరు ధోనీకి శుభాకాంక్షలు తెలిపారు. హర్భజన్‌ సింగ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ధోనికి బర్త్ డే విషెస్‌ తెలియజేస్తున్నారు. ఎంఎస్ ధోని తన కెరీర్‌లో 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు, 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2013 చాంపియ‌న్స్ ట్రోఫీలు సాధించి భారత్‌కు మూడు ఐసీసీ మేజర్‌ ట్రోపీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. కాగా ఎంఎస్ ధోని 1981వ సంవత్సరం జూలై 7వ తేదీన జన్మించాడు.

టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ధోనీకి ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు అందజేశాడు. ‘ఇలాంటి నాయకుడు ఎక్కడా లేడు. భారత క్రికెట్ కోసం మీరు చేసినదానికి ధన్యవాదాలు. నువ్వు నాకు ఎప్పుడూ ఒక అన్నయ్యలా ఉన్నావు. మీపైన నాకు ఎల్లప్పుడూ ప్రేమ మరియు గౌరవం ఉంటుంది’ అని కోహ్లీ తన ట్విటర్ లో పేర్కొన్నాడు.

ఇక ధోనీతో ప్రత్యేక అనుబంధమున్న సురేశ్ రైనా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘నా పెద్ద అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు. జీవితంలోని ప్రతి దశలోనూ నాకు సపోర్టర్ మరియు మెంటర్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. మహి భాయ్, మీకు రాబోయే సంవత్సరం గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

ఇక మరో మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా ధోనీకి శుభాకాంక్షలు అందజేశాడు. ‘పూర్తి స్టాప్ రాని వరకు, ఒక వాక్యం పూర్తి కాదు. అలాగే ధోని క్రీజులో ఉన్నంత వరకు మ్యాచ్ పూర్తి కాదు. ధోనీ లాంటి వ్యక్తిని పొందే అదృష్టం అన్ని జట్లకు ఉండదు. ఎంఎస్ ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓం హెలికాప్టేరాయ నమః’ అని సెహ్వాగ్ ఫన్నీగా ట్వీట్ చేశాడు.

అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమ కెప్టెన్ కు బర్త్ డే విషెస్ చెప్పింది. తలా, మీకు సూపర్ బర్త్ డే’ అంటూ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా 2011 ప్రపంచ కప్ ఫైనల్ లో సిక్స్ కొట్టి జట్టుకి అద్భుతమైన విజయాన్నిచ్చిన వీడియోను షేర్ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eight =