జ్యోతిరాదిత్య సింథియాకు ఉక్కు శాఖ, స్మృతి ఇరానీకి మైనారిటీ వ్యవహారాల శాఖ అదనపు బాధ్యతలు

Jyotiraditya Scindia Smriti Irani Gets Additional Charge of Steel Minority Affairs Ministries, Union Minister Smriti Irani gets additional charge of Minority Affairs, Smriti Irani Gets Additional Charge of Steel, Jyotiraditya Scindia Gets Additional Charge of Steel, Minority Affairs Ministries, Ministry of Minority Affairs, Smriti Irani Gets Additional Charge of Steel Minority Affairs Ministries, Jyotiraditya Scindia Gets Additional Charge of Steel Minority Affairs Ministries, Jyotiraditya Scindia to hold additional charge as Steel Minister, Smriti Irani gets Minority Affairs Minister, Steel Minister, Jyotiraditya Scindia, Smriti Irani, Union Ministers, Mango News, Mango News Telugu,

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్‌ నఖ్వీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌ (ఆర్సీపీ సింగ్) బుధవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీరిద్దరి పదవీకాలం నేటితో(జూలై 7, గురువారం) ముగియనుండడంతో కేంద్ర కేబినెట్ లో ఉన్న వీరిద్దరూ తమ రాజీనామాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. అనంతరం ప్రధాని మోదీ సలహా మేరకు కేంద్ర కేబినెట్ నుండి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆర్సీపీ సింగ్ రాజీనామాలను భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తక్షణమే ఆమోదించినట్టు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు ఉక్కు శాఖ అదనపు బాధ్యతలును, అలాగే కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలును అప్పగిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని సలహా మేరకు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ప్రస్తుతం ఉన్న పోర్ట్‌ఫోలియోతో పాటు మైనారిటీ వ్యవహారాల శాఖను, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు ప్రస్తుతం ఉన్న పోర్ట్‌ఫోలియోతో పాటుగా ఉక్కు మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించాలని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదేశాలు ఇచ్చినట్టు రాష్ట్రపతి భవన్ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలో జ్యోతిరాదిత్య సింథియా తన ప్రస్తుత పోర్ట్‌ఫోలియోతో పాటు కేంద్ర ఉక్కు మంత్రిగా కూడా గురువారం నాడు బాధ్యతలు చేపట్టారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here