ఫ్రెంచ్ ఓపెన్ 2022: పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో క్యాస్పర్ రూడ్‌పై రఫెల్ నాదల్ విజయం, శుభాకాంక్షలు తెలిపిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌

French Open 2022 Rafael Nadal Beats Casper Ruud To Clinches 14th Roland-Garros Title, 2022 French Open Rafael Nadal Beats Casper Ruud To Clinches 14th Roland-Garros Title, Rafael Nadal Beats Casper Ruud To Clinches 14th Roland-Garros Title, 14th Roland-Garros Title, Rafael Nadal Beats Casper Ruud, Casper Ruud, Rafael Nadal, French Open 2022, 2022 French Open, French Open, Roland-Garros Title, Roland-Garros Title News, Roland-Garros Title Latest News, Roland-Garros Title Latest Updates, Roland-Garros Title Live Updates, Rafael Nadal defeated Casper Ruud, French Open 2022 Final, Mango News, Mango News Telugu,

ఫ్రెంచ్ ఓపెన్ 2022లో స్పెయిన్‌ టెన్నిస్ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదల్‌ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో నార్వేకి చెందిన ప్రత్యర్థి కాస్పర్‌ రూడ్‌పై అద్భుత విజయం సాధించాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 6–3, 6–3, 6–0తో రూడ్‌ను వరుస సెట్లలో ఓడించాడు. తద్వారా ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను 14వ సారి ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో రఫెల్ నాదల్‌.. 22వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుచుకున్నాడు. టెన్నిస్ టాప్ ప్లేయర్ రోజర్‌ ఫెదరర్‌ ఈ టోర్నీకి గైర్హాజరీ అయిన విషయం తెలిసిందే. మరో స్టార్ ప్లేయర్ నొవాక్‌ జొకోవిచ్‌ను క్వార్టర్స్‌లో అద్భుత విజయం ద్వారా ఇంటిబాట పట్టించిన నాదల్‌కు ఇక ఫైనల్లో కాస్పర్‌ రూడ్‌పై విజయం నల్లేరు మీద నడకే అయింది. ఈ విజయం ద్వారా ‘క్లే కోర్ట్ కింగ్’ గా పేరున్న నాదల్ మట్టి కోర్టులో తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించుకున్నాడు.

దీనిపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ట్విట్టర్ వేదికగా నాదల్ కు శుభాకాంక్షలు తెలిపాడు. ‘36 ఏళ్ల వయసులో ఫ్రెంచ్‌ఓపెన్‌లో రికార్డు స్థాయిలో 14వ టైటిల్‌.. 22వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలవడం నిజంగా అద్భుతం.. అసాధారణ విజయం. కంగ్రాట్స్‌ నాదల్‌’’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నాడు. అలాగే భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సహా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తదితరులు కూడా నాదల్ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 2 =