జ్ఞానవాపి మసీద్‌ ప్రాంగణంలో బయటపడిన శివలింగం.. మొత్తం ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి కోర్టు ఆదేశం

Gyanvapi Survey Hindu Lawyers Claims Shivling Found in Masjid Varanasi Court Orders To Seal Premises, Gyanvapi Survey Hindu Lawyers Claims Shivling Found in Masjid, Varanasi Court Orders To Seal Premises, Hindu Lawyers Claims Shivling Found in Masjid, Court orders to seal Gyanvapi mosque, Gyanvapi mosque, Gyanvapi Masjid Case, civil court in Varanasi issued orders to seal area after a shivling found inside a well in Gyanvapi mosque, Gyanvapi mosque survey, Court ordered to seal wazukhana in Gyanvapi Masjid, Shivling Found During Gyanvapi Survey, Shivling Found in Masjid, Varanasi Court Orders To Seal Gyanvapi Masjid Premises, Gyanvapi Masjid Case News, Gyanvapi Masjid Case Latest News, Gyanvapi Masjid Case Latest Updates, Gyanvapi Masjid Case Live Updates, Mango News, Mango News Telugu,

ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసిలో గల ‘జ్ఞానవాపి మసీద్‌’ ప్రాంగణంలో పురాతన శివలింగం బయటపడిందన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ మేరకు హిందూ మహిళల తరపు న్యాయవాది, మసీదు ప్రాంగణంలోని కొలనులో శివలింగం కనిపించిందని కోర్ట్ దృష్టికి తీసుకురావడంతో.. వారణాసి సివిల్ కోర్టు ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా చూడాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ని ఆదేశించింది. దీంతో కోర్టు అధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే మసీదు ప్రాంతంలో పారామిలిటరీ దళాలను మోహరించింది. ఇతరులెవరినీ లోపలకు అనుమతించనీయటం లేదు.

వివరాలలోకి వెళ్తే.. ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న ‘జ్ఞానవాపి కాంప్లెక్స్‌’లో ఒక మసీదు ఉంది. అయితే ఇక్కడ ఒకప్పుడు శివాలయం ఉండేదని, కాబట్టి పాత టెంపుల్‌ కాంప్లెక్స్‌ గోడను ఆనుకుని ఉన్న దైవ ప్రతిమలకు నిత్యం పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన వారణాసి కోర్ట్.. ఒక ప్రత్యేక కమిషనర్‌, న్యాయవాదుల బృందాన్ని వీడియోగ్రఫీ ద్వారా సర్వే చేపట్టాలని ఆదేశించింది. అలాగే జ్ఞానవాపి మసీదు నిర్మాణంపై విచారణ జరపాలని వారణాసిలోని కోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించింది. దీనికి సంబంధించిన మూడు రోజుల వీడియోగ్రఫీ సర్వే తదుపరి విచారణ రేపు సుప్రీంకోర్ట్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రాంగణం లోని కోనేరులో శివలింగాన్ని కనుగొన్నట్లు మహిళల తరపు లాయర్లు కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు.

ఇదిలా ఉండగా, జ్ఞాన్‌వాపి మసీదును సర్వే చేయాలంటూ వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుపై అంజుమన్ ఇంతజామియా మసీదు కమిటీ వేసిన అప్పీల్‌ను కూడా సుప్రీంకోర్టు రేపు విచారించే అవకాశం ఉంది. జ్ఞాన్‌వాపి మసీదు అంజుమన్ ఇంతేజామియా మసీదు నిర్వహణ కమిటీ సర్వేను నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మంగళవారం దీనిపై విచారణ చేపట్టనుంది. 1991లో దాఖలు చేసిన అసలు దావాపై అలహాబాద్ హైకోర్టు ఇప్పటికే స్టే విధించిందని, అయితే దానిని దాటవేసేందుకు 2021లో మరో పిటిషన్ దాఖలయ్యిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 1991 మరియు 2021 పిటిషన్లు రెండూ అయోధ్య తీర్పు సమయంలో సుప్రీంకోర్టులోని ఐదు బెంచ్ కూడా ఆమోదించిన ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం, 1991కి వ్యతిరేకంగా ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here