మే 28న ఎన్ఠీఆర్ శత జయంతి ఉత్సవాలు.. నిమ్మకూరులో ప్రారంభించనున్న నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna To Starts NTR Centenary Celebrations Throughout The Year From May 28, Balakrishna To Starts NTR Centenary Celebrations Throughout The Year From May 28, Hero Nandamuri Balakrishna To Starts NTR Centenary Celebrations Throughout The Year From May 28, Actor Nandamuri Balakrishna To Starts NTR Centenary Celebrations Throughout The Year From May 28, NTR Centenary Celebrations Throughout The Year From May 28, NTR Centenary Celebrations, NTR Centenary Celebrations News, NTR Centenary Celebrations Latest News, NTR Centenary Celebrations Latest Updates, Actor Nandamuri Balakrishna, Hero Nandamuri Balakrishna, Nandamuri Balakrishna, Mango News, Mango News Telugu,

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్ఠీఆర్) శత జయంతి సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యేడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన అభిమానులు. ఈ శత జయంతి ఉత్సవాలను ఆయన కుమారుడు, తెలుగు అగ్ర హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఎన్ఠీఆర్ పుట్టిన ఊరు నిమ్మకూరులో మే 28న ఘనంగా ప్రారంభం కానున్నాయి. అలాగే అభిమానుల ఆధ్వర్యంలో గుంటూరు, తెనాలి పట్టణాలలో ఎన్ఠీఆర్ శత జయంతి సందర్భంగా.. ఏడాది పొడవునా నిర్వహించనున్న కార్యక్రమాలను బాలకృష్ణ ప్రారంభించనున్నారని సమాచారం. కాగా మరోవైపు ఈసారి ఒంగోలులో జరుగనున్న ‘మహానాడు’ వేదికగా ఎన్ఠీఆర్ శత జయంతి ఉత్సవాలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా.. రాష్ట్రమంతటా రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు వంటి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలియజేశాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here