టీ20 ప్రపంచ కప్ 2022: విన్నర్, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంతంటే?

ICC Announced the Prize Money Details for ICC Men's T20 World Cup 2022, BCCI New Team, ICC Mens T20 World Cup 2022, ICC Mens Team, T20 World Cup 2022, ICC Mens Indian Team, Mango News, Mango News Telugu, Rohit Sharma C, KL Rahul VC, Virat Kohli, Suryakumar Yadav, Deepak Hooda, R Pant WK, Dinesh Karthik WK, Hardik Pandya, R. Ashwin, Y Chahal, Axar Patel, Jasprit Bumrah, B Kumar, Harshal Patel, Arshdeep Singh, T20 World Cup Latest News And Updates, Prize Money Of USD 1.6 Million

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్-2022 అక్టోబర్ 16వ తేదీ నుండి నవంబర్ 13వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ పాల్గొనే క్రికెట్ బోర్డులు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం టీ20 ప్రపంచ కప్ 2022 కోసం ప్రైజ్ మనీని ప్రకటించింది. నవంబర్ 13న మెల్‌బోర్న్‌లో జరిగే టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టు 1,600,000 డాలర్ల మొత్తాన్ని అనగా రూ.13.05 కోట్లను గెలుచుకోనుంది. అలాగే రన్నరప్ జట్టు 8,00,00 డాలర్లు (రూ.6.53 కోట్లు) అందుకోనున్నారు. ఈ టోర్నమెంట్ మొత్తానికి వివిధ స్థాయిల్లో మొత్తం 5,600,000 (రూ.45.68 కోట్లు) అందజేయనున్నట్టు ఐసీసీ ప్రకటించింది.

T20 ప్రపంచ కప్ 2022 కోసం భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికా వంటి ఎనిమిది జట్లు నేరుగా సూపర్ 12 రౌండ్ కు చేరుకున్నాయి. మిగతా ఎనిమిది జట్లు గ్రూప్-ఎలో నమీబియా, శ్రీలంక, నెదర్లాండ్స్, యూఏఈ మరియు గ్రూప్-బీ లోని వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వే ఇలా నాలుగు చొప్పున రెండు గ్రూపులుగా విడిపోయి మొదటి రౌండ్ ఆడనున్నాయి. మొదటి రౌండ్‌లో ఏదైనా జట్టు విజయం కోసం 40,000 డాలర్ల ప్రైజ్ మనీ ఇవ్వబడుతుందని, 12 మ్యాచ్‌ లకు మొత్తం 480,000 డాలర్లు అందజేయనున్నట్టు ఐసీసీ తెలిపింది. ఇక మొదటి రౌండ్‌లో నాకౌట్ అయిన నాలుగు జట్లకు ఒక్కొక్కరికి 40,000 డాలర్లు లభిస్తాయని తెలిపారు.

టీ20 ప్రపంచ కప్ 2022 ప్రైజ్ మనీ వివరాలు:

  • టైటిల్ విన్నర్ – 1,600,000 డాలరర్లు (రూ.13.05 కోట్లు)
  • రన్నరప్ – 8,00,00 డాలర్లు (రూ.6.53 కోట్లు)
  • ఓడిపోయిన సెమీ ఫైనలిస్టులు – ఒక్కో జట్టుకు 400,000 డాలర్లు (రూ.3.27 కోట్లు) – రెండు జట్లకు కలిపి 8,00,00 డాలర్లు (రూ.6.53 కోట్లు)
  • సూపర్ 12 జట్ల నిష్క్రమణ – ఒక్కో జట్టుకు 70,000 డాలర్లు (రూ.57.8 లక్షలు) – 8 జట్లకు కలిపి 5,60,00 డాలర్లు
  • సూపర్ 12 విజయాలు – విజయం సాధించిన జట్టుకు మ్యాచ్ కు – 40,000 డాలర్లు (రూ.32.62 లక్షలు) – 30 విజయాలుకు మొత్తం 1,200,000 డాలర్లు
  • ఫస్ట్ రౌండ్ విజయాలు – విజయం సాధించిన జట్టుకు మ్యాచ్ కు 40,000 డాలర్లు (రూ.32.62 లక్షలు) – 12 విజయాలుకు మొత్తం 480,000 డాలర్లు
  • ఫస్ట్ రౌండ్ నిష్క్రమణ – 40,000 డాలర్లు (రూ.32.62 లక్షలు) – 4 జట్లకు మొత్తం 160,000 డాలర్లు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 2 =