తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

AP Govt Advisor Sajjala Ramakrishna Reddy Responds Over Telangana Minister Harish Rao Comments, AP Govt Advisor Sajjala Ramakrishna Reddy, Telangana Minister Harish Rao, Sajjala Ramakrishna Reddy, Minister Harish Rao, Mango News, Mango News Telugu, Govt Advisor Sajjala, Telangana Minister Harish Rao, Harish Rao Comments, AP Govt Advisor Sajjala Ramakrishna Reddy Slams Harish Rao, Harish Rao Telangana Minister, Harish Rao Latest News And Updates, Sajjala Ramakrishna Reddy News

తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయులపై గురువారం చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హరీశ్ వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించిన సంగతి తెలిసిందే. ఏపీ టీచర్లు సంతోషంగా ఉన్నారని, వారి గురించి మాట్లాడేవారు ఇక్కడకు వచ్చి చూస్తే తెలుస్తుందని బొత్స అన్నారు. ఇదేక్రమంలో తాజాగా మంత్రి హరీశ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. హరీశ్ రావు ఎందుకు అలా మాట్లాడారో తనకు తెలియదని, మొదట వాళ్ళ సమస్యలు చూసుకోవాలని సూచించారు. ఎవరి సమస్యలు వారికుంటాయని, అయినా రెండు రాష్ట్రాల మధ్య విభజన జరిగిన నాటి నుంచి ఉన్న సమస్యలపై మాట్లాడితే మంచిదని సజ్జల చెప్పారు. ఇక ఏపీలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం చక్కగా జరుగుతోందని, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం పారదర్శకంగా అమలుచేస్తోందని, సీఎం జగన్ ఎమ్మెల్యేలతో తరచుగా భేటీ అవుతూ మార్గనిర్దేశనం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =