టీ20 ప్రపంచ కప్-2022: నేటి నుంచే సూపర్-12 రౌండ్ ప్రారంభం, రేపే భారత్, పాక్ మధ్య కీలక పోరు

ICC Men’s T20 World Cup 2022 Super 12 Round Begins From Today India Vs Pak Match on OCT 23, ICC Men’s T20 World Cup, T20 World Cup Super 12 Schedule, T20 Cricket World Cup 2022, Mango News, Mango News Telugu, India vs Pakistan Match Prediction, IND vs PAK ICC T20 World Cup 2022, India v Pakistan ICC Men's T20 World Cup, T20 World Cup, T20 World Cup Latest News And Updates, Men's T20 World Cup 2022, India vs Pakistan

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచ కప్-2022 కీలక సమరం నేటితో ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్-2022 అక్టోబర్ 16 నుండి ఆస్ట్రేలియాలో ప్రారంభం కాగా అక్టోబర్ 21 వరకు ఫస్ట్ రౌండ్ మ్యాచ్ లు జరిగాయి. దీంతో నేటి నుంచే (అక్టోబర్ 22, శనివారం) సూపర్-12 రౌండ్ ప్రారంభం కానుంది. భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు నేరుగా సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధించగా, ఫస్ట్ రౌండ్ అనంతరం శ్రీలంక, నెదర్లాండ్స్, జింబాంబ్వే, ఐర్లాండ్ జట్లు సూపర్-12 రౌండ్ కు చేరుకున్నాయి. సూపర్-12లో గ్రూప్-1 లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, ఐర్లాండ్ జట్లు ఉండగా, గ్రూప్‌-2 లో భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, జింబాంబ్వే జట్లు ఉన్నాయి.

సూపర్-12 రౌండ్ లో భాగంగా తొలిమ్యాచ్ గ్రూప్-1 లోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే రెండో మ్యాచ్ ఇంగ్లాండ్‌, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక టీ20 ప్రపంచ కప్-2022లో భారత్ జట్టు రేపు (అక్టోబర్ 23, ఆదివారం) తొలి మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడనుంది. గ్రూప్-2 లో ఉన్న భారత్‌, పాకిస్తాన్ రేపు తలపడనున్నాయి. మెల్ బోర్న్ ఏంసీజీ స్టేడియంలో మరోసారి జరగనున్న దాయాదుల మధ్య ఆసక్తికర, ఉత్కంఠ పోరు కోసం క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరోవైపు టీ20 ప్రపంచ కప్-2022 తోలి సెమీ ఫైనల్ సిడ్నీలో నవంబర్ 9న, రెండవ సెమీ ఫైనల్ అడిలైడ్ లో నవంబర్ 10న జరుగనుంది. అలాగే మెల్ బోర్న్ వేదికగా ఫైనల్ నవంబర్ 13, ఆదివారం నాడు జరుగనుంది. కాగా ఈ టోర్నమెంట్ మొత్తం ఆస్ట్రేలియాలోని కార్డినియా పార్క్, బెల్లెరివ్ ఓవల్, ది గబ్బా, పెర్త్ స్టేడియం, అడిలైడ్ ఓవల్, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వంటి ఏడు స్టేడియాల్లోనే జరగనుంది. రసవత్తరంగా సాగనున్న సూపర్-12 రౌండ్ లో ఘన విజయాలతో ఏ జట్లు సెమీస్ కు చేరనున్నాయి?, ఏ జట్టు టీ20 ప్రపంచ కప్ సొంతం చేసుకోనుందో వేచి చూడాల్సి ఉంది.

టీ20 ప్రపంచ కప్-2022: సూపర్-12 లో టీమిండియా మ్యాచ్ ల షెడ్యూల్:

  • అక్టోబర్ 23: భారత్ x పాకిస్థాన్: సమయం –మధ్యాహ్నం 1:30 గంటలకు
  • అక్టోబర్ 27 భారత్ x నెదర్లాండ్స్: సమయం – మధ్యాహ్నం 12:30 గంటలకు
  • అక్టోబర్ 30 భారత్ x సౌతాఫ్రికా: సమయం – సాయంత్రం 4:30 గంటలకు
  • నవంబర్ 2 భారత్ x బంగ్లాదేశ్: సమయం – మధ్యాహ్నం 1:30 గంటలకు
  • నవంబర్ 6 భారత్ x జింబాబ్వే: సమయం – మధ్యాహ్నం 1.30 గంటలకు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + one =