ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌: నెంబర్​ 1 స్థానంలో నిలిచిన సూర్యకుమార్ యాదవ్

ICC T20 Batting Rankings Team India Player Suryakumar Yadav is the New No 1 Men's T20I Batter, ICC T20 Batting Rankings, Suryakumar Yadav No 1 Men's T20I Batter, Suryakumar T20I No1 Batsmen, Mango News,Mango News Telugu, Suryakumar Yadav, Yadav Surges To No. 1, ICC Men's T20I Player, T20 World Cup 2022, Sky Top Five T20I Innings, IND vs BAN, IND vs BAN Rain News, India's Suryakumar Yadav

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో టీ20 ర్యాంకింగ్స్ ను అప్డేట్ చేసింది. కాగా టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ నెంబర్​ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది మార్చిలో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్ ఫామ్ తో పరుగుల వరద సృష్టిస్తున్నాడు. తాజాగా ఐసీసీ టీ20 ర్యాకింగ్స్​లో పాకిస్తాన్ ఓపెనర్​ మహమ్మద్ రిజ్వాన్​ను వెనక్కునెట్టి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్ ఇప్పటికే ఈ సంవత్సరం టీ20ల్లో ఎనిమిది అర్ధ సెంచరీలు మరియు ఒక అద్భుత సెంచరీని నమోదు చేశాడు.

భారత్ జట్టు తరపున సూర్యకుమార్ టీ20ల్లో నాలుగో స్థానంలో ఆడుతున్నప్పటికీ, ర్యాంకింగ్స్ లో 863 రేటింగ్ పాయింట్స్ తో కెరీర్ లో నెంబర్ 1గా నిలవడం తన అద్భుతమైన ఫామ్ కు తార్కాణంగా నిలుస్తుంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2022 జరుగుతుండగా భారత్ ఆడిన మూడు మ్యాచ్ లలో సూర్యకుమార్ మూడు ఇన్నింగ్స్‌ల నుండి 134 పరుగుల చేశాడు. నెదర్లాండ్స్ మరియు సౌతాఫ్రికాపై హాఫ్ సెంచరీలు చేశాడు. అక్టోబర్ 30న పెర్త్‌లో సౌతాఫ్రికాపై సూర్యకుమార్ చేసిన 68 పరుగులు, అతని కెరీర్ కే ఒక హైలైట్ అని మాజీ ఆటగాళ్లు, క్రీడా విశ్లేషకులు పేర్కొన్నారు.

అలాగే టీ20 ప్రపంచకప్-2022లో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో 10వ స్థానానికి చేరుకున్నాడు. భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 15వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ రెండు, న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే మూడు, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ నాలుగు, దక్షిణాఫ్రికా ఆటగాడు అయిడెన్ మార్కరం ఐదో స్థానాల్లో ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =