దేశంలోనే అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది: మంత్రి తలసాని

Minister Talasani Srinivas Hand Over Kalyana Lakshmi Shadi Mubarak Cheques to 84 Beneficiaries, Kalyana Lakshmi Cheques Distrubuted, Shadi Mubarak Cheques Distrubuted, Kalyana Lakshmi, Shadi Mubarak Cheques to 84 Beneficiaries, Minister Talasani Srinivas Yadav, Mango News, Mango News Telugu,Kalyana Lakshmi,Shadi Mubarak, TRS Party, KCR , BRS Party, KTR, Kavitha Kalavakuuntla, Telangana Latest News And Updates

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో 84 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి తలసాని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలోనే అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని అన్నారు.

అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో ఆదర్శ పాలనను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. నిరుపేద ఆడపడుచుల పెండ్లికి ఒక లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం ఒక్క తెలంగాణ లో తప్ప దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పెన్షన్ లు, రైతులకు పంట పెట్టుబడుల కోసం ఆర్ధిక సహాయం వంటి అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన వారు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, మహేశ్వరి, హేమలత, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ, ఆకుల రూప, ఉప్పల తరుణి, తహశీల్దార్ లు శైలజ, విష్ణు సాగర్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + fourteen =