ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ : అగ్రస్థానంలో మార్నస్ లబుషెన్, ఏడో స్థానంలో కోహ్లీ

2021 ICC Test Player Rankings, 2021 ICC Test Rankings, cricket news, ICC Test Player Rankings, ICC Test Player Rankings 2021, ICC Test rankings, ICC Test Rankings 2021, latest ICC Test Rankings, Mango News, Mango News Telugu, Marnus Labuschagne, Marnus Labuschagne Becomes No 1 Virat Kohli Slips To No 7, sports news, Test Rankings 2021, Virat Kohli, Virat Kohli slips to 7th spot ahead of SA tour, Virat Kohli slips to No 7

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏడో స్థానానికి (756) పడిపోయాడు. కాగా రోహిత్ శర్మ ర్యాంక్ లో ఎలాంటి మార్పు లేదు, గతంలో లాగనే 5వ (797)స్థానంలోనే ఉన్నాడు. భారత బ్యాట్స్‌మెన్‌ లలో టాప్-10 ర్యాంకింగ్స్ లో వీరిద్దరే ఉన్నారు. ఇక ఇటీవల అద్భుత ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ మార్నస్ లబుషెన్ 912 రేటింగ్ తో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌ జో రూట్ రెండో స్థానంలో (897), ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ మూడోస్థానంలో (884), న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ 879 రేటింగ్ తో నాలుగో స్థానంలో నిలిచాడు.

మరోవైపు ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో పాట్ కమ్మిన్స్ 912 పాయింట్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ బౌలర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో స్థానంలో (883), షాహిన్ అఫ్రీది మూడో స్థానంలో (822) నిలిచారు. భారత్ జట్టు తరఫున టాప్‌-10 ర్యాంకింగ్స్ లో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక్కడే ఉన్నాడు. టాప్-10 ఆల్‌రౌండర్ల జాబితాలో వెస్టిండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ నెంబర్ 1 స్థానంలో, భారత్ నుంచి అశ్విన్‌ 2, రవీంద్ర జడేజా 3వ స్థానాల్లో కొనసాగుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − three =