ఒమిక్రాన్‌ ఎఫెక్ట్ : ఢిల్లీలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సమావేశాలపై నిషేధం

christmas, Christmas and New Year Gatherings Banned in Delhi, Christmas and New Year Gatherings Banned in Delhi Amid Rise in Omicron Cases, COVID-19, Delhi bans gatherings for Christmas, Delhi Christmas, delhi coronavirus, delhi coronavirus cases, delhi coronavirus cases live update, delhi coronavirus news, Delhi Coronavirus Updates, Delhi Government, Delhi omicron, Delhi omicron cases, Mango News Telugu, New Year Celebrations, New Year celebrations banned in Delhi, New Year Gatherings, Omicron covid variant, Omicron variant, omicron variant in India, Union health ministry

దేశంలో ఒమిక్రాన్‌ కరోనా వేరియంట్ కేసులు రోజురోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు అత్యధికంగా 57 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమై కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు మరియు సమావేశాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (డీడీఎంఏ) అథారిటీ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

ఢిల్లీ వ్యాప్తంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సమావేశాలు జరగకుండా చూసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్‌ లకు డీడీఎంఏ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండడంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలంతా భౌతికదూర నిబంధనలు పాటించడం, మాస్క్‌లు ధరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 11 =