ఐసీసీ ర్యాంకింగ్స్‌ : పైకి దూసుకొచ్చిన రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా

Bumrah, ICC Test rankings, Jasprit Bumrah, Jasprit Bumrah makes entry into top 10, Jasprit Bumrah Returns to Top 10, Kohli slips to fifth Bumrah rises to ninth spot, Kohli slips to fifth Bumrah rises to ninth spot in ICC Test Rankings, Mango News, test ranking batsman, Test Rankings, Virat Kohli, Virat Kohli Slips to 5th Bumrah Rises to 9th Rank, Virat Kohli slips to fifth, Virat Kohli slips to fifth in ICC Test Rankings

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో టెస్టు ర్యాంకింగ్స్, టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా పైకి దూసుకొచ్చారు. బౌలింగ్ విభాగం టాప్-10లో రవిచంద్రన్ అశ్విన్ (856) రెండో స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్‌ తో తొలి టెస్టులో ప్రదర్శన అనంతరం జస్ప్రీత్‌ బుమ్రా 760 పాయింట్లతో 9వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్‌ విభాగం టాప్-10 లో రవీంద్ర జడేజా 377 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకోగా, రవిచంద్రన్ అశ్విన్ 4వ స్థానంలో నిలిచాడు.

బ్యాటింగ్ విభాగంలో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానం పడిపోయి 791 పాయింట్లతో ఐదో ర్యాంకులో నిలవగా, రోహిత్ శర్మ (764), రిషబ్ పంత్ (746) పాయింట్లతో 6, 7 ర్యాంకుల్లో ఉన్నారు. అదేవిధంగా ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో మొదటి మూడు స్థానాల్లో కేన్‌ విలియమ్సన్‌(901), స్టీవ్‌ స్మిత్‌ (911), మార్నస్‌ లబుషేన్‌ (878) నిలిచారు. ఇక టీ20 ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ 5వ ర్యాంకులో, లోకేష్ రాహుల్ 6వ ర్యాంకులో ఉన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =