వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా, అక్టోబరు లేదా నవంబరులో నిర్వహణ

Andhra Pradesh, Andhra Pradesh govt releases list of YSR award winners, AP Govt Postpones YSR Awards Felicitation Ceremony, Mango News, Postpones YSR Awards Felicitation, YSR Achievement awards, YSR Awards, YSR Awards Felicitation Ceremony, YSR Awards Felicitation Ceremony Postponed, YSR Awards Felicitation Postponed, YSR Life Time Achievement Awards, YSR Lifetime Achievement

వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే వైఎస్ఆర్ లైఫ్‌టైం ఏచీవ్‌మెంట్, వైఎస్ఆర్ ఏచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రక్రమాన్ని ఆగస్టు 13న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 150 మందికి మించి ప్రజలు ఎక్కడా కూడా హాజరుకావడం లేదా గుమికూడద్దొని వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలో వైఎస్ఆర్ అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతో పాటుగా, ప్రభుత్వ ఆదేశాలు అమల్లో ఉండడంతో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం పేర్కొంది. అవార్డు గ్రహీతల వయస్సు, వారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 13న జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని, వచ్చే అక్టోబరు లేదా నవంబరు నెలలో ఒక తేదీ నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − six =