వెస్టిండీస్‌తో నేడు మూడో వన్డే, క్లీన్‌స్వీప్‌పై టీమిండియా కన్ను

Ind vs WI 3rd ODI Team India Eye on The Clean Sweep Against West Indies by Today's Match, Team India Eye on The Clean Sweep Against West Indies by Today's Match, India eye clean sweep against West Indies, Team India eye series clean sweep, India vs West Indies 3rd ODI, Ind vs WI 3rd ODI, India will Eye on The 3-0 series clean sweep, India vs West Indies 3rd ODI at the Queen's Park, West Indies aims to finish Today's Match on a high, Ind vs WI 3rd ODI News, Ind vs WI 3rd ODI Latest News, Ind vs WI 3rd ODI Latest Updates, Ind vs WI 3rd ODI Live Updates, Ind vs WI 3rd ODI Highlights, Mango News, Mango News Telugu,

శిఖర్ ధవన్‌ నేతృత్వంలోని టీమిండియా వెస్టిండీస్‌పై అసాధారణ ఆటతీరు ప్రదర్శిస్తోంది. వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకెళుతోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఉత్కంఠ విజయాలతో సిరీస్‌ దక్కించుకున్న టీమిండియా ఇప్పుడు క్లీన్ స్వీప్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలో బుధవారం పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో మూడో వన్డే ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-0తో లీడ్‌లో ఉన్న టీమిండియా ఈరోజు జరగబోయే మూడో మ్యాచ్‌లోనూ గెలిచి కరేబీయన్లను వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్‌ రెండింటిలో టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తుండటం కలిసొచ్చే అంశం.

కెప్టెన్ ధవన్ తో పాటు యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మాన్ గిల్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అక్షర్ పటేల్, చాహల్‌లు ఆకట్టుకుంటూండగా, ఠాకూర్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్‌లు పర్వాలేదనిపిస్తున్నారు. మరోవైపు విండీస్ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ భారత్‌కు గట్టి పోటీ ఇచ్చినా గెలుపు వాకిట బోల్తా పడింది. దీంతో చివరి మ్యాచ్‌లో నైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఓపెనర్లు షై హాప్, మేయర్స్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బ్రూక్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్‌లు ఫామ్ లో ఉండటంతో ఈ లాస్ట్ మ్యాచ్ సిరీస్‌లో మరో టఫ్ ఫైట్ అవ్వొచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు.

జట్లు అంచనా..

భారత్: శిఖర్ ధవన్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్/అర్ష్‌దీప్ సింగ్.

వెస్టిండీస్: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వికెట్ కీపర్), కైల్ మేయర్స్, షమర్ బ్రూక్స్, బ్రాండన్ కింగ్, రోవ్‌మాన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్, హేడెన్ వాల్ష్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 16 =