శ్రీలంక, ఇండో-నేపాల్ సరిహద్దుల్లో క్యాసినో నిర్వహణ.. హైదరాబాద్ వాసులపై ఈడీ దాడులు

Hyderabad ED Conducts Raids on Two Casino Organizers Houses and Offices For FEMA Violations, Enforcement Directorate Conducts Raids on Two Casino Organizers Houses and Offices For FEMA Violations, ED Raids on Two Casino Organizers Houses and Offices For FEMA Violations, ED Conducts Raids on Two Casino Organizers Houses and Offices For FEMA Violations In Hyderabad, Foreign Exchange Management Act Violations, Two Casino Organizers Offices, Two Casino Organizers Houses, Enforcement Directorate, FEMA Violations, ED is carrying out raids on casino dealers and agents in eight locations in Hyderabad for FEMA Violations, FEMA Violations News, FEMA Violations Latest News, FEMA Violations Latest Updates, FEMA Violations Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కలకలం సృష్టించాయి. నగరంలోని మొత్తం ఎనిమిది ప్రాంతాలలో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్యాసినో నిర్వాహకులుగా భావిస్తున్న చికోటి ప్రవీణ్‌ కుమార్, మాధవ రెడ్డి అనే ఇద్దరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. వీరు శ్రీలంక, ఇండో-నేపాల్ సరిహద్దుల్లో క్యాసినోలు నిర్వహించారనే సమాచారంతో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సైఫాబాద్‌లోని చికోటి ప్రవీణ్ మరియు సికింద్రాబాద్‌లోని బోవెన్‌పల్లిలో మాధవ రెడ్డి ఇళ్లపై ఒకేసారి దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రవీణ్‌కు చెందిన మరో ఇంటిలో కూడా ఈడీ సోదాలు చేపట్టింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో వీరిద్దరిపై దాడులు నిర్వహించినట్లు సమాచారం.

కాగా వీరిద్దరిపై విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ కేసు నమోదు చేసింది. ఈ ఇద్దరూ గేమింగ్‌లో గెలుపొందిన ప్రైజ్ మనీని హవాలా మార్గాల ద్వారా బదిలీ చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇక వీరి ద్వారా రిక్రూట్ చేయబడిన ఏజెంట్లు ప్రత్యేక విమానాల ద్వారా నేపాల్‌లోని ఒక హోటల్‌లో ఆల్ ఇన్ క్యాసినోకు కస్టమర్‌లను రవాణా చేస్తున్నారు. అలాగే జూన్ 10 నుంచి 13 వరకు ఈవెంట్ కూడా నిర్వహించినట్లు సమాచారం. హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నంలకు చెందిన ఒక్కో కస్టమర్ నుంచి ఏజెంట్లు రూ.3 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. నాలుగు రోజుల ప్యాకేజీలో ప్రత్యేకంగా వివిధ ప్లాన్ టారిఫ్‌లు కూడా అందించినట్లు తెలుస్తోంది.

దీనిలో భాగంగా క్యాసినో ఆడే వారి కోసం స్పెషల్ ఫ్లైట్‌ లలో లోకల్ ఏజెంట్లు టిక్కెట్లు ఏర్పాట్లు చేసి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా వెస్ట్ బెంగాల్‌లోని బాగ్ డోగ్ర ఎయిర్‌పోర్టుకు కస్టమర్లలను తరలించారు. అక్కడి నుంచి నేపాల్‌లోని హోటల్ మెచి క్రౌన్‌లో ఆల్ ఇన్ క్యాసినో పేరుతో ఈవెంట్ నిర్వహించారు. జూన్ 10వ తేదీ నుంచి 13 వరకు ఇండో నేపాల్ బోర్డర్‌లో ఈవెంట్ ప్రైజ్ మనీని హవాలా రూపంలో చెల్లించారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నుంచి కస్టమర్లను తీసుకొచ్చారు. నాలుగు రోజుల ప్యాకేజీలో భాగంగా ఒక్కో కస్టమర్ నుంచి లోకల్ ఏజెంట్లు రూ. 3 లక్షలు వసూలు చేశారు. అయితే వీరు నేపాల్‌తో పాటు ఇండోనేషియాలోనూ క్యాసినో ఈవెంట్‌లు నిర్వహించారని, ఈ ఈవెంట్‌లలో టాలీవుడ్‌, బాలీవుడ్‌ సహా నేపాలీ డ్యాన్సర్లతో కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయించినట్లు ఈడీకి ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =