రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్‌ ఘనవిజయం.. సిరీస్ సమం, రోహిత్ శర్మ సూపర్ షో

India Beat Australia by 6 Wickets in 2nd T20 To Level The 3-Match Series 1-1, India Beat Australia by 6 Wickets, India Won Againast Australia, India Vs Australia Match, India Vs Aus T20, India Won Aus Match By 6 WIckets, Mango News, Mango News Telugu, India Vs Australia, India Captain Rohit Sharma, Virat Kohli, Hadik Pandya, Australia Player Wade, DInesh Karthik, IND Vs AUS, India Vs Australia 8 Overs Match, Ind Vs Aus T-20 Series Match

నాగ్‌పూర్‌లో శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్‌ ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా 8 ఓవర్లకే పరిమితమైన ఈ మ్యాచ్‌లో భారత్‌ చెలరేగింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, బౌలింగ్‌లో అక్షర్ పటేల్ రాణించడంతో ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 91 పరుగుల ఛేదనలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 నాటౌట్‌) చివరివరకూ క్రీజులో నిలిచి జట్టుని గెలిపించాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. కాగా అవుట్‌ఫీల్డ్ తడి కారణంగా ప్రారంభం ఆలస్యం కావడంతో ఔటింగ్ ఎనిమిది ఓవర్ల చొప్పున షూటౌట్‌కి కుదించబడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ జట్టులో మాథ్యూ వేడ్ 20 బంతుల్లో నాలుగు బౌండరీలు, రెండు సిక్సర్లతో 43 పరుగులు నాటౌట్‌, ఆరోన్ ఫించ్‌ 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31 పరుగులు చేశారు. అక్షర్‌కు రెండు వికెట్లు దక్కాయి.

అనంతరం ఛేదనలో భారత్‌ 7.2 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులు చేసి గెలిచింది. రాహుల్‌ (10), కోహ్లీ (11), సూర్యకుమార్‌ (0), హార్దిక్‌ పాండ్యా (9) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా, రోహిత్ మాత్రం తొలినుంచి ఎదురుదాడి కొనసాగించాడు. ఈ క్రమంలో టీమిండియా విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం కాగా దినేష్ కార్తీక్ తొలి రెండు బంతుల్లో 6, 4 కొట్టి ఇండియాకు విజయాన్ని అందించాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో జంపాకు 3 వికెట్లు దక్కగా, రోహిత్‌ శర్మ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 176 సిక్సర్లతో తొలి స్థానంలో నిలవగా, న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గప్టిల్ 172 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక సిరీస్‌లో చివరిదైన నిర్ణాయక మ్యాచ్‌ ఆదివారం హైదరాబాద్‌లో జరుగనుంది.

స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా: ఫించ్‌ (బి) బుమ్రా 31, గ్రీన్‌ (రనౌట్‌) 5, మ్యాక్స్‌వెల్‌ (బి) అక్షర్‌ 0, టిమ్‌ డేవిడ్‌ (బి) అక్షర్‌ 2, వేడ్‌ (నాటౌట్‌) 43, స్మిత్‌ (రనౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 8 ఓవర్లలో 90/5.

బౌలింగ్‌: పాండ్యా 1-0-10-0, అక్షర్‌ పటేల్‌ 2-0-13-2, చాహల్‌ 1-0-12-0, బుమ్రా 2-0-23-1, హర్షల్‌ 2-0-32-0.

భారత్‌: రాహుల్‌ (బి) జంపా 10, రోహిత్‌ (నాటౌట్‌) 46, కోహ్లీ (బి) జంపా 11, సూర్యకుమార్‌ (ఎల్బీ) జంపా 0, పాండ్యా (సి) ఫించ్‌ (బి) కమ్మిన్స్‌ 9, దినేశ్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 7.2 ఓవర్లలో 92/4.

బౌలింగ్‌: హాజెల్‌వుడ్‌ 1-0-20-0, కమ్మిన్స్‌ 2-0-23-1, జంపా 2-0-16-3, సామ్స్‌ 1.2-0-20-0, అబాట్‌ 1-0-11-0.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + eleven =