వాహనదారులకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్​ ప్రీమియం ధరల పెంపు

India Central Govt Hikes Third Party Motor Insurance Premium For Cars and Two-Wheelers From June 1, Central Govt Hikes Third Party Motor Insurance Premium For Cars and Two-Wheelers From June 1, India Central Govt Hikes Third Party Motor Insurance Premium For Cars From June 1, India Central Govt Hikes Third Party Motor Insurance Premium For Two-Wheelers From June 1, Central Govt Hikes Third Party Motor Insurance Premium, Third Party Motor Insurance Premium, India Central Govt, Third Party Motor Insurance Premium For Cars, Third Party Motor Insurance Premium For Two-Wheelers, Cars, Two-Wheelers, Third Party Motor Insurance Premium, Mango News, Mango News Telugu,

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్​ ప్రీమియం ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మే 25న వివిధ కేటగిరీల వాహనాలకు థర్డ్-పార్టీ మోటారు బీమా ప్రీమియంను జూన్ 1 నుండి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బైకులు, కార్ల బీమా ధరలు పెరగనున్నాయి. కాగా విద్యాసంస్థలకు చెందిన బస్సుల ప్రీమియంపై 15% డిస్కౌంట్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల ప్రీమియంపై 7.5% డిస్కౌంట్ ప్రకటించారు. సవరించబడిన రేట్ల ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్​ ప్రీమియం ధరలు ఈ క్రింది విధంగా ఉండనున్నాయి.

ద్విచక్ర వాహనాలు
  • 150 cc – 350 cc సామర్ధ్యం కలిగిన ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్​ ప్రీమియం- రూ. 1,366
  • 350 cc కంటే ఎక్కువ సామర్ధ్యం కలిగిన బైకుల ఇన్సూరెన్స్​ ప్రీమియం – రూ. 2,804
ప్రైవేట్ కార్లు
  • 1,000 cc ఇంజిన్ సామర్థ్యం కలిగిన ప్రైవేట్ కార్స్ ఇన్సూరెన్స్​ ప్రీమియం – రూ. 2,094
  • 1,000 cc నుంచి 1,500 cc ఇంజిన్ సామర్థ్యం కలిగిన ప్రైవేట్ కార్స్ ఇన్సూరెన్స్​ ప్రీమియం – రూ. 3,416
  • 1,500 cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్ధ్యం కలిగిన ప్రైవేట్ కార్స్ ఇన్సూరెన్స్​ ప్రీమియం – రూ. 7,890
ఎలక్ట్రిక్ కార్లు
  • 30 కిలోవాట్ల కంటే తక్కువ సామర్ధ్యం కలిగిన ఎలక్ట్రిక్ కార్ల ఇన్సూరెన్స్​ ప్రీమియం – రూ. 1,780
  • 30-65 కిలోవాట్ల మధ్య సామర్ధ్యం కలిగిన ఎలక్ట్రిక్ కార్ల ఇన్సూరెన్స్​ ప్రీమియం – రూ. 2,904
కమర్షియల్ వాహనాలు
  • 12,000 -20,000 కేజీల సామర్ధ్యం కలిగిన కమర్షియల్ వాహనాల ప్రీమియం – రూ. 35,313
  • 40,000 కేజీల కంటే ఎక్కువ సామర్ధ్యం కలిగిన వాహనాల ఇన్సూరెన్స్​ ప్రీమియం – రూ. 44,242
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 16 =