ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ గా ప్రమాణస్వీకారం చేసిన వినయ్ కుమార్ సక్సేనా

Vinai Kumar Saxena Sworn In as New Lieutenant Governor Of Delhi, New Lieutenant Governor Of Delhi, Vinai Kumar Saxena Takes Oath as New Lieutenant Governor Of Delhi, Vinai Kumar Saxena takes oath as Delhis lieutenant governor, Vinai Kumar Saxena sworn in as Delhi’s new Lieutenant Governor, Vinai Kumar Saxena on Thursday was sworn in as the Lieutenant Governor of Delhi, Vinai Kumar Saxena sworn in as new Delhi Lieutenant Governor, Vinai Kumar Saxena, former KVIC chairman, EX-KVIC chairman Vinai Kumar Saxena Sworn In as New Lieutenant Governor Of Delhi, EX-KVIC chairman Vinai Kumar Saxena, EX-KVIC chairman, Lieutenant Governor Of Delhi, New Lieutenant Governor News, New Lieutenant Governor Latest News, New Lieutenant Governor Latest Updates, New Lieutenant Governor Live Updates, Mango News, Mango News Telugu,

ఢిల్లీ 22వ లెఫ్టినెంట్ గవర్నర్‌ గా వినయ్ కుమార్ సక్సేనాను నియమిస్తున్నట్టు మే 23న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కార్యాలయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నాడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ గా వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘీ వినయ్ కుమార్ సక్సేనా చేత ప్రమాణం చేయించగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముందుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ గా ఉన్న అనిల్ బైజాల్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. అనిల్ బైజాల్ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించిన అనంతరం, వినయ్ కుమార్ సక్సేనాను నియమిస్తున్నట్టు ప్రకటించారు.

మార్చి 23, 1958న ఉత్తర్ ప్రదేశ్ లో జన్మించిన వినయ్ కుమార్ సక్సేనా, 1981లో కాన్పూర్ యూనివర్సిటీ నుండి పట్టభద్రుడయ్యారు. అనంతరం రాజస్థాన్‌ లోని జేకే గ్రూప్‌లో అసిస్టెంట్ ఆఫీసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్‌పర్సన్ గా వినయ్ కుమార్ సక్సేనా విధులు నిర్వర్తించారు. అలాగే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల నిర్వహణకై గత ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ కమిటీలో సభ్యుడిగా కూడా సక్సేనాకు చోటు కల్పించారు. మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్‌ గా వినయ్ కుమార్ సక్సేనా నియామకంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, ప్రజల తరపున ఆయనకు స్వాగతం పలుకుతున్నానని, ఢిల్లీ అభివృద్ధి కోసం ఢిల్లీ ప్రభుత్వ కేబినెట్ నుంచి పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + eighteen =