దేశంలో కరోనా వ్యాప్తి.. 24 గంటల్లో కొత్తగా 224 కేసులు నమోదు, 4 వేలకు పడిపోయిన యాక్టివ్ కేసులు

India Corona Updates Union Health Ministry Reports 224 New Infections and 4503 Active Cases in Last 24 Hrs,India Corona Updates,Union Health Ministry Reports 224 New Infections,India 4503 Active Cases in Last 24 Hrs,Mango News,Mango News Telugu,MoHFW,India Fights Corona,Coronavirus Latest News,COVID-19 Current cases,COVID-19 pandemic in India,Coronavirus Statistics,Official Updates Coronavirus,Ministry of Health,Corona cases in India today,Corona cases in India today live updates,Corona new updates in India,Corona updates in India 2023,Coronavirus Latest News,Coronavirus outbreak,Coronavirus Update in India

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ నెల ప్రారంభంలో ప్రతిరోజూ వెయ్యికి పైనే నమోదయిన కొత్త కేసులు.. ఆ తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. రెండు వారాల నుంచి రోజుకి వెయ్యి లోపే కేసులు నమోదవుతుండగా.. గత వారంలో మాత్రం కొత్త కేసులు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ దేశంలో కరోనాకు సంబంధించిన కేసుల వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం.. గడిచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు) మొత్తం 98,167 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 224 మందిలో కోవిడ్-19 పాజిటివ్‌ వెలుగు చూసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,49,90,278కి చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలకు పడిపోయింది. కాగా మరోవైపు ఒక్క రోజులో కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. తద్వారా దేశవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,867కి చేరింది.

దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, మే 30, ఉదయం 8 గంటల వరకు):

  • గత 24 గంటల్లో నిర్వహించిన కరోనా పరీక్షలు : 98,167
  • కొత్తగా నమోదైన కేసులు [మే 29–మే 30 (8AM-8AM)] : 224
  • మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,49,90,278
  • కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 429
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,44,53,908
  • కరోనా రికవరీ రేటు : 98.82 శాతం
  • యాక్టివ్ కేసులు : 4,503
  • కొత్తగా నమోదైన మరణాలు : 1
  • మొత్తం మరణాల సంఖ్య : 5,31,867
  • మొత్తం కరోనా వ్యాక్సిన్‌ డోసులు: 220.66 (2,20,67,09,286) కోట్లు పంపిణీ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + two =