భారత్‌లో కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో వెయ్యి లోపు నమోదైన కొత్త కేసులు, 10 వేలల్లో యాక్టివ్‌ కేసులు

India Corona Updates Union Health Ministry Reports 899 New Infections and 10179 Active Cases in Last 24 Hrs,India Corona Updates,Union Health Ministry Reports 899 New Infections,Corona 899 New Infections,India 10179 Active Cases in Last 24 Hrs,Mango News,Mango News Telugu,MoHFW,Coronavirus Outbreak,India Fights Corona,Coronavirus cases in India,COVID-19 Current cases,Coronavirus Latest News,India Corona Latest News,India Corona Latest Updates,India Corona Live News

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత రెండు రోజులుగా వెయ్యి లోపే నమోదైన కొత్త కేసులు బుధవారం వెయ్యి దాటగా.. గురువారం మళ్ళీ వెయ్యికి తక్కువగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ దేశంలో కరోనాకు సంబంధించిన కేసుల వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం.. గడిచిన 24 గంటల్లో (బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు) మొత్తం 1,29,610 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 899 మందిలో కోవిడ్-19 పాజిటివ్‌ వెలుగు చూసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,49,84,058కి చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేలకు పడిపోయింది. కాగా మరోవైపు ఒక్క రోజులో కరోనా మహమ్మారి బారిన పడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తద్వారా దేశవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,814కి చేరింది.

దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, మే 18, ఉదయం 8 గంటల వరకు):

  • గత 24 గంటల్లో నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,29,610
  • కొత్తగా నమోదైన కేసులు [మే 17–మే 18 (8AM-8AM)] : 899
  • మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,49,84,058
  • కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 2,100
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,44,42,065
  • కరోనా రికవరీ రేటు : 98.79 శాతం
  • యాక్టివ్ కేసులు : 10,179
  • కొత్తగా నమోదైన మరణాలు : 13
  • మొత్తం మరణాల సంఖ్య : 5,31,814
  • మొత్తం కరోనా వ్యాక్సిన్‌ డోసులు: 220.66 (2,20,66,94,822) కోట్లు పంపిణీ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =