దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 13878 కరోనా బాధితులు

Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, Coronavirus India News LIVE Updates, COVID-19 pandemic in India, India Coronavirus, India Covid-19 Updates, total corona cases in india today, Total Corona Positive Cases in India, total corona positive in india Coronavirus Cases, coronavirus cases in india state wise, coronavirus cases in india today state wise, coronavirus cases india

భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. మార్చి 2020 తర్వాత యాక్టీవ్ కరోనా కేసులు (1,38,556) కనిష్ఠానికి చేరుకున్నాయి. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 1.10 శాతంగా నమోదవగా, వరుసగా గత 38 రోజులుగా పాజీటివిటీ రేటు 2 శాతం కన్నా తక్కువగానే నమోదవుతుంది. దేశవ్యాప్తంగా కొత్తగా 13,091 పాజిటివ్ కేసులు నమోదవగా, 340 మంది మరణించారు. దీంతో నవంబర్ 11, గురువారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 3,44,01,670 కు, మరణాల సంఖ్య 4,62,189 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

గత 24 గంటల వ్యవధిలో 13,878 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,38,00,925 కు చేరుకుంది. ఇక కరోనా రికవరీ రేటు 98.25 శాతం గానూ, మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 1,38,556(0.40%) మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 11 =