దేశంలో ఒక్కసారిగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు

India LPG Cylinder Petrol And Diesel Prices Are Increased in The Country, LPG Cylinder Petrol And Diesel Prices Are Increased in The Country, LPG Cylinder Prices Are Increased in The Country, Diesel Prices Are Increased in The Country, Petrol Prices Are Increased in The Country, Petrol And Diesel Prices, LPG Cylinder Prices, Diesel Prices, Petrol Prices, Petrol Prices Latest News, Petrol Prices Latest Updates, Petrol Prices Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలో ఎల్‌పీజీ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశీయ LPG సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. గతేడాది అక్టోబర్ 6 తర్వాత ఢిల్లీ, ముంబై మరియు ఇతర నగరాల్లో మొదటిసారిగా ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ లేని డొమెస్టిక్ LPG సిలిండర్ ధర పెరిగింది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2003.50 గా ఉంది. ప్రముఖ కంపెనీలు చేసిన ప్రకటన ప్రకారం రూ. 899.50 నుండి రూ. 949.5 వరకు ధర పెరిగింది. అలాగే గతేడాది నవంబర్ తర్వాత మొదటిసారిగా పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు కూడా పెంచారు. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దరిమిలా పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెరుగుదలను నిలిపివేశారు.

తాజా పెరుగుదలతో ఢిల్లీలో పెట్రోల్ మరియు డీజిల్ యొక్క రిటైల్ ధర ఒక్కొక్కటి 80 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ₹ 96.21కి పెరిగింది, డీజిల్ ధరలు లీటరుకు ₹ 87.47కి పెరిగాయి. భారతదేశం తన చమురు అవసరాలలో 85 శాతం దిగుమతి చేసుకుంటుంది. దేశంలోని స్థానిక పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రెండు ఇంధనాల అంతర్జాతీయ ధరలతో ముడిపడి ఉంటాయి. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు పెరగడంతో ధరల పెంపు తప్పటంలేదని కంపెనీలు పేర్కొంటున్నాయి. దీంతోపాటు తాజాగా జరుగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం వలన కూడా పలు దేశాల్లో ధరలు పెరుగుతున్నాయి. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు రష్యా-ఉక్రెయిన్ వివాదం తీవ్రతరం కావడంతో బ్యారెల్‌కు దాదాపు $120 వరకు పెరిగాయి మరియు రిటైల్ ధరలను పెంచాలని రాష్ట్ర ఇంధన కంపెనీలపై ఒత్తిడి తెచ్చాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 15 =