దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 11,451 కరోనా కేసులు నమోదవడంతో నవంబర్ 8, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,43,66,987 చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 266 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,61,057 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, మిజోరాం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి.
దేశంలో 1,42,826 యాక్టీవ్ కరోనా కేసులు, గత 262 రోజుల్లో ఇదే తక్కువ:
దేశంలో ప్రస్తుతం 1,42,826 (0.42%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. యాక్టీవ్ కేసులు గత 262 రోజుల్లో కనిష్టానికి చేరుకున్నాయి. కొత్తగా 13,204 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 3,37,63,104 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 98.24 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. ఇక నవంబర్ 7, ఆదివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 61,60,71,949 కు చేరుకుంది. నవంబర్ 7న 8,70,058 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ