దేశంలో మళ్ళీ 20 లక్షలు దాటిన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 85.86 శాతం

India Records 259170 New Covid-19 Cases and 1761 Deaths in Last 24 Hours,Covid-19 in India,Coronavirus Cases In India, Coronavirus In India,Coronavirus India Live Updates, Coronavirus Live Updates, Coronavirus Positive Cases List, COVID 19 Deaths, COVID-19, COVID-19 Cases in India,COVID-19 Daily Bulletin,Covid-19 In India,Covid-19 Latest Updates, COVID-19 New Live Updates,Covid-19 Positive Cases,India Coronavirus,India COVID 19,India Covid-19 Deaths Report,India Covid-19 Latest Reports,India COVID-19 Reports,India Covid-19 Updates,India New COVID 19 Cases,Mango News,Mango News Telugu,India Covid-19 259170 Positive Cases,India Records 1761 Deaths in Last 24 Hours,Coronavirus Updates,Coronavirus Latest News Updates

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. వరుసగా ఆరో రోజు కూడా 2 లక్షలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 2,59,170 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 58,924 కేసులు ఒక్క మహారాష్ట్ర రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఏప్రిల్ 20, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,53,21,089 కు చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 1761 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,80,530 కు చేరుకుంది.

దేశంలో 20 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 85.86 శాతం:

ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, ఛత్తీస్‌ గడ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య మళ్ళీ 20 లక్షలు (20,31,977) దాటింది. మరోవైపు 1,54,761 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,31,08,582 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 85.86 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. ఇక ఏప్రిల్ 19, సోమవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 26,94,14,035 కు చేరుకుంది. గత 24 గంటల్లో 15,19,486 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 5 =