తెలంగాణలో నేటి నుంచే నైట్ కర్ఫ్యూ, మినహాయింపు ఉన్నసేవలు ఇవే….

Telangana Govt Imposed Night Curfew in the State from 9 PM to 5 AM Till April 30,Telangana Government,Telangana Government Latest News,Telangana,Telangana News,TS,TS News,Mango News,Night Curfew,Telangana Government Imposes Night Curfew,Telangana Government Imposes Night Curfew Till 30th April,TS Government Announced To Impose Night Curfew,Telangana Imposes Night Curfew Till April 30 Amid Covid-19,Telangana Night Curfew,Telangana Night Curfew Till April 30,TS Government Imposes Night Curfew From 9 PM To 5 AM,Telangana Imposes Night Curfew Till April 30,Coronavirus Live Updates,Night Curfew Imposed In Telangana,Night Curfew In Telangana,COVID-19 Live Updates,Telangana Lockdown News Live,Coronavirus Lockdown India News Live Updates,Mango New Telugu

రాష్ట్రంలో రోజురోజుకి కరోనాకేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రి 9.00 గంటలనుండి ఉదయం 5.00 గంటల వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను విధించాలని నిర్ణయించారు. నేటి నుంచి మే 1వ తేదీ ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అన్ని కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, షాపింగ్‌మాల్స్‌, దుకాణాలు, థియేటర్లు, రెస్టారెంట్లు మొదలైనవి రాత్రి 8.00 గంటలకు మూసివేయబడతాయని పేర్కొన్నారు. ఇక ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లు, ఫార్మసీలు, ఇతర అవసరమైన సేవలకు మినహాయింపు ఇచ్చినట్టు పేర్కొన్నారు.

నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉన్న సేవలు ఇవే:

  • ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా.
  • టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సేవలు, ప్రసార మరియు కేబుల్ సేవలు, ఐటి మరియు ఐటి
    ఎనబుల్డ్ సేవలు.
  • ఇ-కామర్స్ ద్వారా అన్ని వస్తువుల పంపిణీ.
  • పెట్రోల్ పంపులు, ఎల్‌పిజి, సిఎన్‌జి, పెట్రోలియం మరియు గ్యాస్ అవుట్‌లెట్‌లు.
  • విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం మరియు పంపిణీ.
  • నీటి సరఫరా మరియు పారిశుధ్యం.
  • కోల్డ్ స్టోరేజ్ మరియు గిడ్డంగి సేవలు.
  • ప్రైవేట్ భద్రతా సేవలు.
  • నిరంతర ప్రక్రియ అవసరమయ్యే ఉత్పత్తి యూనిట్లు లేదా సేవలు.

రాత్రి 9 గంటల తర్వాత కదలికలకు అనుమతి ఉన్న వర్గాలివే:

  • అత్యవసర సేవలు, కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులు.
  • భారత ప్రభుత్వ అధికారులు, తెలంగాణ ప్రభుత్వ అధికారులు మరియు తెలంగాణ పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీ రాజ్ సంస్థల ఎమెర్జెన్సీ డ్యూటీ అధికారులు(చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తప్పనిసరి).
  • వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడిక్స్ వంటి అన్నిరకాల ప్రైవేట్ వైద్య సిబ్బంది మరియు ఇతర ఆసుపత్రి సేవల ప్రొవైడర్స్ (చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తప్పనిసరి).
  • వైద్య సంరక్షణ అవసరమున్న గర్భిణీ స్త్రీలు మరియు రోగులు.
  • విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల నుండి వచ్చే లేదా వెళ్లే వ్యక్తులు చెల్లుబాటు అయ్యే టికెట్ చూపించాల్సి ఉంటుంది.
  • ఇంటర్-స్టేట్ మరియు ఇంట్రా-స్టేట్ కు సంబంధించి అవసరమైన మరియు అవసరం లేని వస్తువుల కదలిక/రవాణా వంటి వాటిపై ఎటువంటి పరిమితి ఉండదు. అలాగే ఎటువంటి ప్రత్యేక అనుమతి/పాస్ అవసరం లేదు.
  • ఆటోలు మరియు టాక్సీలతో సహా ప్రజా రవాణా సేవలు నైట్ కర్ఫ్యూ వ్యవధిలో పైన పేర్కొన్న వర్గాల ప్రజల రవాణా కోసం నిర్ణీత సమయంలో పనిచేయడానికి అనుమతించబడతాయి.
  • నైట్ కర్ఫ్యూపై నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయి మరియు అలాగే మే 1, 2021 ఉదయం 5.00 గంటల వరకు అమలులో ఉంటాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − ten =