దేశంలో ఒకేరోజు 386452 కరోనా పాజిటివ్ కేసులు, 3498 మరణాలు నమోదు

India Records 386452 New Covid-19 Cases and 3498 Deaths in Last 24 Hours,Covid-19 in India,Coronavirus Cases In India,Coronavirus In India,Coronavirus India Live Updates, Coronavirus Live Updates, Coronavirus Positive Cases List, COVID 19 Deaths, COVID-19, COVID-19 Cases in India,COVID-19 Daily Bulletin,Covid-19 In India,Covid-19 Latest Updates, COVID-19 New Live Updates,Covid-19 Positive Cases,India Coronavirus,India COVID 19,India Covid-19 Deaths Report,India Covid-19 Latest Reports,India COVID-19 Reports,India Covid-19 Updates,India New COVID 19 Cases,Mango News,Mango News Telugu,India Covid-19 386452 Positive Cases,India Records 3498 Deaths in Last 24 Hours,Coronavirus Updates,Coronavirus Latest News Updates,India Records 386452 New Covid-19 Cases

భారత్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్ కేసులు నమోదవగా, 3498 మంది మరణించారు. దీంతో ఏప్రిల్ 30, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,87,62,976 కు, మరణాల సంఖ్య 2,08,330 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఒకే రోజులో 2,97,540 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 1,53,84,418 కు చేరుకుంది.

దేశంలో ఓవైపు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రసుతం కరోనా రికవరీ రేటు 81.99 శాతం గానూ, మరణాల రేటు 1.11 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 31,70,228 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =