దేశంలో కొత్తగా 82 మందికి కరోనా పాజిటివ్, కేసులు ఏ రాష్ట్రాల్లో ఎక్కువంటే?

India Reports 82 New Covid-19 Positive Cases 85 Recoveries in Last 24 Hours,India Reports 82 New Covid-19 Positive Cases, 85 Recoveries in Last 24 Hours, Covid Deaths,Covid Last 24 Hours, 82 People Tested Positive,Coronavirus In India,Mango News,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశంలో కొత్తగా 100 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 59,037 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 82 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.14 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,84,200 కు చేరుకుంది. ఇక కరోనా వలన మరో మూడు మరణాలు (ఉత్తర్ ప్రదేశ్ లో 2, పశ్చమబెంగాల్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,753కి పెరిగింది. అలాగే 85 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,51,610 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.

కాగా ప్రస్తుతం దేశంలో 1,837 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కేసులు కొద్దిగా ఎక్కువ నమోదు అయ్యాయి. అయితే ఏ రాష్ట్రంలో కూడా 30కి పైన కరోనా కేసులు నమోదవలేదు.

గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలివే (ఫిబ్రవరి 12 (8am)–ఫిబ్రవరి 13 (8am)):

  1. కేరళ – 29
  2. కర్ణాటక – 20
  3. మహారాష్ట్ర – 14
  4. తమిళనాడు – 5
  5. తెలంగాణ – 3.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 2 =