భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడే తోలి టీ20 మ్యాచ్

India vs England T20 Series First T20 Match Today at Southampton, India vs England First T20 Match Today at Southampton, First T20 Match Today at Southampton, India vs England 1st T20 highlights, 1st T20 highlights, Hardik Pandya became the first Indian to score a half century and take four wickets in a T20I, Hardik Pandya stars with the bat as well as the ball as India take 1-0 lead in series, Hardik Pandya stars with bat and ball as India thrash England by 50 runs, India thrash England by 50 runs, Hardik Pandya produced an all-round show, India crushed England by 50 runs in first T20I in Southampton, India vs England, first T20 international, India vs England T20 Series News, India vs England T20 Series Latest News, India vs England T20 Series Latest Updates, India vs England T20 Series Live Updates, Mango News, Mango News Telugu,

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నేడు (జూలై 7, గురువారం) సౌతాంప్టన్‌ లోని ది రోజ్ బౌల్ స్టేడియంలో తోలి టీ20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటల నుంచి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా కోవిడ్ పాజిటివ్ తేలడంతో ఇంగ్లాండ్ తో ఐదో టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ కెప్టెన్ గా ఈ మ్యాచ్ నుంచి తిరిగి బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు మొదటి టీ20 మ్యాచ్ కు బీసీసీఐ ప్రకటించిన భారత్ జట్టులో ఇంగ్లాండ్ తో ఐదో టెస్టు మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో లేరు. వీరంతా రెండవ, మూడో టీ20 మ్యాచుల్లో ఆడనున్నారు. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా యువ ఆటగాళ్లు, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, చాహల్ వంటి సీనియర్ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనతో రాణించాల్సి ఉంది.

ఇక ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్ తర్వాత జోస్ బట్లర్ పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఇంగ్లాండ్ కు పూర్తిస్థాయి కెప్టెన్‌గా మొదటి మ్యాచ్ ఆడనున్నాడు. అలాగే ఇంగ్లాండ్ జట్టులో డేవిడ్‌ మలాన్, లివింగ్‌స్టోన్, జేసన్‌ రాయ్, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్ రాణించడంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ 2-2తో సమమైన నేపథ్యంలో తాజా టీ20 సిరీస్ లో సత్తాచాటి పైచేయి సాధించాలని ఇరు జట్లు ఎదురుచూస్తున్నాయి.

భారత్ (తుది జట్టు అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్/అర్ష్దీప్ సింగ్.

ఇంగ్లాండ్ (తుది జట్టు అంచనా): జేసన్‌ రాయ్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మలన్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీస్ టోప్లీ, మాట్ పార్కిన్సన్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 9 =