బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ రాజీనామా, తదుపరి పీఎం రేసులో భారత సంతతి నేత రిషి సున‌క్‌?

UK Prime Minister Boris Johnson Resigns Indian-Origin Leader Rishi Sunak in Race For Next PM, Prime Minister Boris Johnson Resigns Indian-Origin Leader Rishi Sunak in Race For Next PM, Indian-Origin Leader Rishi Sunak in Race For Next PM, UK Prime Minister Boris Johnson Resigns, Rishi Sunak in Race For Next PM, Indian-origin Leader Rishi Sunak in race for next UK PM after Boris Johnson agrees to resign, Rishi Sunak in race for next UK PM after Boris Johnson agrees to resign, Race For Next UK PM, Indian-origin AG Suella Braverman, Boris Johnson Resigns, Indian-Origin Leader Rishi Sunak, UK Prime Minister Boris Johnson, Prime Minister Boris Johnson, UK Prime Minister Boris Johnson Resigns News, UK Prime Minister Boris Johnson Resigns Latest News, UK Prime Minister Boris Johnson Resigns Latest Updates, UK Prime Minister Boris Johnson Resigns Live Updates, Mango News, Mango News Telugu,

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే జాన్స‌న్ పరిపాలనపై కేబినెట్ మంత్రులు మరియు అతని కన్జర్వేటివ్ పార్టీ శాసనసభ్యులు ఇప్పటికే విముఖత చూపిస్తున్నారు. ప్రజలలో కూడా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఆయనను సాగనంపడానికి రంగం సిద్ధమైంది. మరోవైపు జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న జాన్సన్ పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పుకున్నారు. అయినా సంతృప్తి చెందని పార్టీ నేతలు ఆయనను ప్రధాని పదవి నుంచి దింపేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే గత కొంతకాలంగా బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత సంవత్సరం కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రోటోకాల్స్ పాటించకుండా అధికారిక నివాసంలో వేడుకలు చేసుకున్నందుకు గానూ ఆయనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జాన్సన్ దిగిపోవాలని కోరుతూ ఇద్దరు రాష్ట్ర కార్యదర్శులు సహా మరో ఇద్దరు మంత్రులు గురువారం ప్రభుత్వం నుండి వైదొలగారు. ఇలా అన్నివైపుల నుంచి ఆయనపై ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రధాని పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి జాన్సన్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ తదుపరి యూకే ప్రధానమంత్రి పదవి చేపట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. 42 ఏళ్ల రిషి సునక్‌ను బోరిస్ జాన్సన్ ఎంపిక చేసి, ఫిబ్రవరి 2020లో ఖజానా ఛాన్సలర్‌గా నియమించారు. కరోనా మహమ్మారి సమయంలో దేశంలోని వ్యాపారులు మరియు కార్మికులకు సహాయం చేయడానికి పది బిలియన్ల పౌండ్ల విలువైన భారీ ప్యాకేజీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ చర్య ద్వారా సునక్‌ పార్టీలోనూ, ప్రజలలోనూ బాగా ప్రాచుర్యం పొందాడు. రిషి సునక్ తాతలు పంజాబ్ నుండి వచ్చి బ్రిటన్ లో స్థిరపడ్డారు. కాగా ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 19 =