వెస్టిండీస్ తో భారత్‌ రెండో టీ20 నేడే, మరో విజయంపై రోహిత్ సేన కన్ను

India vs West Indies 2nd T20 Match Today at Warner Park Stadium, IND vs WI 2nd T20 Match Today at Warner Park Stadium, IND vs WI 2nd T20I, India vs West Indies 2nd T20 Match Today, India's second T20I match against West Indies will be played at Warner Park in Basseterre, Basseterre Warner Park Stadium, India vs West Indies, India vs West Indies 2nd T20, India vs West Indies 2nd T20I Warner Park cricket stadium pitch report and weather forecast, Basseterre Warner Park Stadium cricket stadium pitch report and weather forecast, India vs West Indies 2nd T20I News, India vs West Indies 2nd T20I Latest News, India vs West Indies 2nd T20I Latest Updates, India vs West Indies 2nd T20I Live Updates, Mango News, Mango News Telugu,

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు (ఆగస్టు 1, సోమవారం) వార్నర్ పార్క్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.00 గంటల నుంచి ఈ టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. తోలి టీ20లో ఘన విజయంతో సిరీస్ లో 1-0తో ముందంజలో ఉన్న రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టు మరో విజయంపై కన్నేసింది. కాగా టీ20 ఫార్మట్ లో కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో ఓపెనింగ్ కాంబినేషన్‌ విషయంలో జట్టు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తోలి మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా ఓపెనింగ్ కు వచ్చాడు. ఇటీవల కాలంలో భారత్‌ ఏడు సార్లు తమ ఓపెనింగ్ కాంబినేషన్ ను మార్చింది. మరోవైపు తోలి మ్యాచ్ లో బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్, రవి బిష్ణోయ్‌లతో ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో భారత్ జట్టు బరిలోకి దిగి విజయాన్ని అందుకుంది. ఇదే కాంబినేషన్ ను రెండో మ్యాచ్ లో కూడా కొనసాగిస్తుందా లేదా అనేది వేచిచూడాలి. ఇక చివర్లో దినేశ్‌ కార్తీక్‌ అద్భుత ఫామ్ తో ఫినిషర్‌ పాత్ర పోషించడం జట్టుకు బలంగా మారింది.

ఇక వెస్టిండీస్ జట్టులో నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్‌మెయర్, ఆల్ రౌండర్స్ జాసన్ హోల్డర్, కీమో పాల్ రాణించాల్సి ఉంది. టీ20ల్లో గట్టిపోటీదారుగా ఉన్న విండీస్ జట్టు మళ్ళీ సత్తా చాటాలని చూస్తుంది. కీలక బౌలర్లగా ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్ ఉండగా, అకేల్ హోసేన్ తో పాటుగా మరో స్పిన్నర్‌ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

భారత్ (తుది జట్టు అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అర్ష్దీప్ సింగ్.

వెస్టిండీస్ (తుది జట్టు అంచనా): నికోలస్ పూరన్ (కెప్టెన్, వికెట్ కీపర్), షమర్ బ్రూక్స్, షిమ్రాన్ హెట్మేయర్, రోవ్‌మాన్ పావెల్, కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =