మరో అంతర్జాతీయ సంస్థకు సీఈఓగా భారత సంతతి వ్యక్తి నియామకం

Indian American Raj Subramaniam Appointed as CEO of FedEx Corp, Indian Origin Raj Subramaniam To Lead Multinational FedEx, Indian Origin Raj Subramaniam To giant multinational courier company FedEx, Indian Origin Raj Subramaniam, Indian American Raj Subramaniam, Indian American, Raj Subramaniam, Raj Subramaniam Appointed as CEO of FedEx Corp, Multinational FedEx, CEO of FedEx Corp, Raj Subramaniam an Indian American has been appointed as the new Chief Executive Officer of FedEx, CEO of FedEx, Indian Origin Raj Subramaniam has been appointed as CEO of FedEx, FedEx, giant multinational courier company, FedEx headquartered in the United States of America, Raj Subramaniam Is The New CEO of FedEx, FedEx giant multinational courier company, FedEx New CEO, FedEx New CEO Latest News, FedEx New CEO Latest Updates, Mango News, Mango News Telugu,

గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ట్విట్టర్, ఐబీఎం సహా పలు అంతర్జాతీయ సంస్థలకు భారత సంతతికి చెందిన వ్యక్తులే సీఈఓలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో అంతర్జాతీయ సంస్థ కూడా చేరింది. ప్రముఖ గ్లోబల్ కొరియర్ డెలివరీ సంస్థ ఫెడెక్స్‌ కు భారత సంతతికి చెందిన/భారతీయ అమెరికన్‌ రాజ్‌ సుబ్రమణియం సీఈఓగా, ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈఓ, ఛైర్మన్‌ గా ఉన్న ఫ్రెడరిక్ డబ్ల్యూ స్మిత్ ఇకపై ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారని తెలిపారు. ఈ నియామకాలు జూన్ 1, 2022 నుండి అమలులోకి వస్తాయని ఫెడెక్స్ సంస్థ సోమవారం నాడు ప్రకటించింది.

“ఫెడెక్స్ గత 50 సంవత్సరాలుగా వ్యక్తులను మరియు అవకాశాలను కనెక్ట్ చేయడం ద్వారా ప్రపంచాన్ని మార్చింది. మనం తర్వాత ఏమి జరుగుతుందనే దాని వైపు చూస్తున్నప్పుడు రాజ్ సుబ్రమణియం స్థాయి నాయకుడు ఫెడెక్స్‌ను చాలా విజయవంతమైన భవిష్యత్తులోకి తీసుకెళ్తారనే గొప్ప సంతృప్తి నాకు ఉంది. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నా పాత్రలో, బోర్డు పాలనతో పాటు సుస్థిరత, ఆవిష్కరణ మరియు పబ్లిక్ పాలసీతో సహా ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన సమస్యలపై దృష్టి సారించాలని నేను ఎదురుచూస్తున్నాను” అని ఫెడెక్స్ వ్యవస్థాపకుడు ఫెడ్రిక్ డబ్ల్యూ.స్మిత్ పేర్కొన్నారు.

రాజ్ సుబ్రమణియం 2020లో ఫెడెక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఎన్నికయి, అప్పటినుంచి బోర్డ్‌లో తన స్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఫెడెక్స్ కార్పోరేషన్ యొక్క ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు చేపట్టక ముందు, సుబ్రమణియం ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ అయిన ఫెడెక్స్ ఎక్స్ ప్రెస్ కి ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ (సీఈఓ)గా ఉన్నారు. అలాగే ఫెడెక్స్ కార్పోరేషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్స్ ఆఫీసర్‌గా కూడా ఆయన పనిచేశారు. అక్కడ కార్పొరేట్ వ్యూహాన్ని అభివృద్ధి చేసే బాధ్యతలను నిర్వహించారు. ఇందుకు అదనంగా కెనడాలోని ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ అధ్యక్షుడిగా మరియు 1991లో ఫెడెక్స్‌లో చేరినప్పటి నుండి ఆసియా మరియు యు.ఎస్ అంతటా అనేక ఇతర నిర్వహణ మరియు మార్కెటింగ్ రోల్స్ లో రాజ్ సుబ్రమణియం పనిచేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + nineteen =